గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shweta Basu Prasad : శ్వేతా బ‌సు ప్ర‌సాద్ జీవితం నాశ‌నం అయింది.. అందుకేనా..?

Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క‌..డా… అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన‌ కొత్త బంగారు…

Shweta Basu Prasad : శ్వేతా బ‌సు ప్ర‌సాద్ జీవితం నాశ‌నం అయింది.. అందుకేనా..?

Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క‌..డా… అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన‌ కొత్త బంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించి, క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రకారును తనవైపు ఒక్కసారిగా తిప్పుకుంది శ్వేతా బసు. ఈ చిత్రంలో ఆమె చెప్పిన ప్రతి డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి. మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఓవర్ గ్లామ‌ర్ షో తో సీనియర్ హీరోల సినిమాల‌లో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది.

తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.అప్ప‌ట్లో లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన‌ శ్వేతా బసు డబ్బు కోసం పక్కదారులు పట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. చేతిలో సరైన అవకాశాలు లేకపోవడంతో కొందరు టాలీవుడ్ నిర్మాతలు ఆమెకు డబ్బు ఎరవేసి తప్పుడు దారిలో అడుగులు వేసేలా చేశారని అంటుంటారు. బ్రోకర్ల చేతిలో చిక్కుకుని డబ్బు కోసం వ్యభిచారం చేసేందుకు కూడా సిద్ధమైందని వార్తలు వినిపించాయి.

this is the reason why Shweta Basu Prasad life is spoiled
Shweta Basu Prasad

అంతేకాకుండా శ్వేతాబసు ఒకటి రెండు సార్లు వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికి పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ఓ మాజీ మంత్రితో కూడా రాసలీలలు జరిపినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈమె అతి చిన్న వయసులోనే కెరీర్ ని తన చేతులారా నాశనం చేసుకుంది. ఈమెకు డబ్బుపై ఉన్న ఆశ అనే బలహీనత వల్ల‌ కొందరు నిర్మాతలు, బ్రోకర్లు ఆమెను దెబ్బతీశారని అంటుంటారు.

2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్లైన ఏడాదికే భర్తకు విడాకులు ఇచ్చేసింది శ్వేతా బసు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం సినిమాల‌లో ప్రయత్నిస్తూ సోషల్ మీడియాలో అందాల ఆర‌బోత‌ ఫోటోలు షేర్ చేస్తూ హడావిడి చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి