Krithi Shetty : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఎక్కువ కాలం కొనసాగుతారు. కానీ హీరోయిన్ల లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్ అయితే వరుసగా అవకాశాలు వస్తాయి. లేదంటే ఎలాంటి అవకాశాలు లేక తెరమరుగు అవుతారు. కనుక హీరోల కన్నా హీరోయిన్లే సినిమా రంగంలో చాలా తక్కువ కాలం పాటు ఉంటారని చెప్పవచ్చు. అయితే సినిమాల్లో అవకాశాలు కూడా వారికి అంత ఈజీగా రావు. చాలా వరకు ఆడిషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మేకర్స్ వారిని నచ్చితే తీసుకుంటారు.. లేకపోలేదు.. కానీ ఆ ఒక్క అవకాశం అయితే రావాలి. వస్తే అప్పుడు నటిగా ప్రూవ్ చేసుకోవచ్చు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నటిగా మంచి మార్కులు కొట్టేస్తే ఆ తరువాత తిరుగుండదు. ఇలా హీరోయిన్లుగా రాణించిన వారు చాలా మందే ఉన్నారు.
అయితే సినిమాల్లో రాణించాలంటే ముందుగా కనీసం ఒక్క సినిమాలో నటించే చాన్స్ అయినా రావాలి. దాని కోసమే ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. అయితే యంగ్ బ్యూటీ కృతిశెట్టికి మాత్రం ఆమె తల్లి వల్లే ఉప్పెన సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చిందట. ఎలాగంటే.. కృతిశెట్టికి దంతాలు కాస్త ఎత్తుగా ఉంటాయి. దీంతో ఆమె కొన్ని యాంగిల్స్‌లో బాగానే కనిపించినా.. కొన్ని యాంగిల్స్ లో మాత్రం అంతగా అందంగా ఉండదు. దీంతో ఆమె అనేక ఆడిషన్స్ కు వెళ్లినా చాలా మంది తిరస్కరించారట.
అయితే ఉప్పెన ఆడిషన్స్ సమయంలోనూ కృతిశెట్టికి అలాంటి అనుభవమే ఎదురైందట. ఆమెతో ఆడిషన్స్ చేశాక సారీ.. తరువాత చెబుతాం.. అన్నారట. దీంతో కృతిశెట్టి తల్లి నేరుగా దర్శకుడి వద్దకు వెళ్లి తమ అమ్మాయి బాగా నటిస్తుందని.. కథ డిమాండ్ మేరకు ఎలాంటి పాత్రలో అయినా సరే.. ఏ విధంగా అయినా సరే.. నటిస్తుందని.. ఎలాంటి అభ్యంతరాలు చెప్పదని.. ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటుందని.. రిక్వెస్ట్ చేసిందట. దీంతో కృతిశెట్టికి ఉప్పెనలో అవకాశం వచ్చింది.
అయితే ఉప్పెన మూవీ షూటింగ్ సమయంలోనే ఇతర మేకర్స్‌కు తెలిసి వారు వచ్చి కృతి శెట్టి యాక్టింగ్ చూసి తమ సినిమాల్లో చాన్స్‌లు ఇచ్చారు. అలా ఆమెకు ఉప్పెన వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వచ్చాయి. ఉప్పెన రిలీజ్ కాక ముందే ఈ బ్యూటీ ఆ విధంగా చాన్స్‌లు కొట్టేసింది. దీంతో ఆమె దశ తిరిగిపోయింది. అలా ఆమె తల్లి మాట్లాడింది కాబట్టే.. శ్యామ్ సింగరాయ్ చిత్రంలోనూ నానితో లిప్ లాక్ చేసిందని అంటున్నారు. కథ డిమాండ్ మేరకు కృతి శెట్టి ఎలాంటి పాత్రలో అయినా నటిస్తుందని చెప్పేందుకు శ్యామ్ సింగరాయ్ ఒక ఉదాహరణగా భావించవచ్చు. మరి భవిష్యత్తులో ఇంకా ఏవైనా బోల్డ్ పాత్రల్లో నటించాల్సి వస్తే కృతి శెట్టి అందుకు ఒప్పుకుంటుందా.. లేక ఆ సీన్లలోనూ నటిస్తుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా.. కృతిశెట్టికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు రావడంలో ఆమె తల్లి పాత్ర ఎంతో ఉందని అంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…