Heroines : తాము అభిమానించే తారల జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు, లవ్ స్టోరీల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఇంకా ఎక్కువ ఆసక్తి చూపుతారనే చెప్పవచ్చు. మరీ అభిమానులు అంతగా ఇంట్రెస్ట్ చూపే విశేషాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇంతకీ ఆ విశేషాలు ఏంటంటే.. టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్ లు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు ఆ హీరోయిన్ లు ఎవరో చూద్దాం.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహానటి సావిత్రి తమిళ హీరో జెమిని గణేషన్ ను సీక్రెట్ గా వివాహం చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. లక్స్ సబ్బు ప్రమోషన్స్ లో భాగంగా సావిత్రి జెమిని గణేషన్ అని సంతకం చేయడంతో ఆమె వివాహం చేసుకున్న సంగతి బయటపడింది. కానీ అప్పటికే జెమిని గణేషన్ కు వివాహం జరిగింది. జెమిని గణేషన్ సావిత్రిని రెండో వివాహం చేసుకున్నారు.
మరో స్టార్ హీరోయిన్ జయప్రద కూడా 1986 జూన్ 22వ తేదీన సీక్రెట్ గానే వివాహం చేసుకున్నారు. జయప్రద బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ నహతాని వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ కి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఈ కోవలోనే అతిలోక సుందరి శ్రీదేవి కూడా సీక్రెట్ గానే వివాహం చేసుకుంది. శ్రీదేవి హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే నిర్మాత బోనీకపూర్ తో ప్రేమలో పడింది. అప్పటికే బోనీకపూర్ కు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. బోనీకపూర్ శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ ఇలా రెండో వివాహం చేసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.
బాలకృష్ణ హీరోగా నటించిన ముద్దుల మావయ్య సినిమాలో ఆయనకు సోదరిగా నటించిన సీత కూడా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. సీత కోలీవుడ్ లో హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. సీత 2010లో సీరియల్ నటుడు సతీష్ ను సీక్రెట్ గా వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు.
2003లో రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. చాలా కాలం ప్రేమాయణం నడిపిన తర్వాత వివాహబంధంతో ఈ జంట ఒకటయ్యారు. అదేవిధంగా అగ్రస్థాయి కథానాయకులు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన శ్రీయ కూడా సీక్రెట్ గానే పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. శ్రీయ రష్యాకు చెందిన ఆండ్రి కోషివ్ తో ప్రేమలో పడింది. సీక్రెట్ గా మే 19, 2018 లో ఆండ్రిని వివాహం చేసుకుంది శ్రీయ. వీరిద్దరూ పెళ్లి చేసుకుని బిడ్డకు జన్మనిచ్చేవరకూ వీరి పెళ్లి విషయం బయటకు రాలేదు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…