The Warrior : ది వారియ‌ర్ మూవీ.. దారుణంగా క‌లెక్షన్లు.. రామ్ ఖాతాలో ఇంకో ఫ్లాప్..?

July 16, 2022 6:09 PM

The Warrior : రామ్ పోతినేని మొద‌టి సారిగా పోలీస్ పాత్ర‌లో న‌టించిన మూవీ.. ది వారియర్.. ఈ మూవీ తాజాగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాతో రామ్ తమిళ తెర‌కు కూడా ప‌రిచ‌యం అయ్యారు. లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీలో రామ్ ప‌క్క‌న కృతిశెట్టి హీరోయిన్ గా న‌టించింది. ఇందులో రామ్ పోలీస్ పాత్ర‌లో అద‌రగొట్టాడు. అలాగే పాటలు కూడా బాగానే ఉన్నాయి. కానీ సినిమాకు ఆశించినంత స్థాయిలో స్పంద‌న అయితే రావ‌డం లేదు.

ఈ సినిమాకు గాను టిక్కెట్ల రేట్లు త‌గ్గ‌క‌పోవ‌డం, వ‌ర్షాలు దెబ్బ తీస్తుండ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు క‌రువ‌య్యారు. ఇక సినిమాకు బిలో యావ‌రేజ్‌, నెగెటివ్ టాక్ వ‌స్తోంది. ఇవ‌న్నీ సినిమా క‌లెక్ష‌న్ల‌ను దెబ్బ తీస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సినిమా డిజాస్ట‌ర్ అవుతుందేమోన‌ని అంటున్నారు. అదే జ‌రిగితే రామ్ ఖాతాలో ఇంకో ఫ్లాప్ ప‌డిన‌ట్లేన‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ మూవీకి రూ.35 కోట్ల మేర థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ జ‌ర‌గ్గా.. అందులో 50 శాతం కూడా వ‌స్తాయో.. రావో.. అని అంటున్నారు.

The Warrior movie collections are dropping may be flop
The Warrior

ది వారియ‌ర్ మూవీకి గాను మొద‌టి రోజు రూ.6 కోట్లు వ‌చ్చాయి. అంటే 17 శాతం రిక‌వ‌రీ అయింది. ఇక రెండో రోజు నుంచి క‌లెక్ష‌న్ల‌లో దారుణ‌మైన డ్రాప్ క‌న‌బ‌డుతోంది. అంటే సినిమాకు 50 శాతం రిక‌వ‌రీ అయ్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే ది వారియ‌ర్ మూవీ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అవుతుంద‌ని అంటున్నారు. అయితే వీకెండ్ రావ‌డంతో క‌లెక్ష‌న్ల‌లో ఏమైనా మార్పు క‌నిపిస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా సోమ‌వారం ముగిస్తేనే గానీ ది వారియ‌ర్ భ‌విత‌వ్యం ఏంటి ? అనేది తెలియ‌దు. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment