గురువారం, జూన్ 11, 2026
వార్తలు

The Legend : ది లెజెండ్‌కు పెట్టింది రూ.80 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోతుంది..!

The Legend : అరుళ్‌ శరవణన్ ది లెజెండ్ మూవీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నిటి మీద ట్రోలింగ్ చేశారు. ఆఖరికి జర్నలిస్టుల సమావేశంలో కూడా ఇంత బడ్జెట్…

The Legend : ది లెజెండ్‌కు పెట్టింది రూ.80 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలిస్తే.. దిమ్మ తిరిగి పోతుంది..!

The Legend : అరుళ్‌ శరవణన్ ది లెజెండ్ మూవీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నిటి మీద ట్రోలింగ్ చేశారు. ఆఖరికి జర్నలిస్టుల సమావేశంలో కూడా ఇంత బడ్జెట్ తో సినిమా ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు. ఎట్టకేలకు ది లెజెండ్ పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది.

ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్‌ లుక్స్ గురించి, 51 ఏళ్ళ వయసులో హీరోగా చేస్తూ.. రూ.80 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడేంటీ.. ఇతను ఏమైనా పిచ్చోడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. సినిమాపై నెగెటివిటీ ఉన్నప్పటికీ కొంతవరకు జనాలు ఈ మూవీని చూడడానికి వెళ్లారు. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. ఒకసారి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే..

The Legend movie budget and final collections report is here
The Legend

ది లెజెండ్ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా రూ.7.82 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా వరకు అడ్వాన్స్ బేసిస్ మీదే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. కాబట్టి పెట్టిన రూ.80 కోట్ల బడ్జెట్ రికవరీ చేయాల్సి ఉంది. నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఎంత జరిగింది అనే వివరాలు బయటకు రాలేదు.

తమిళనాడులో అయితే శరవణన్ స్టోర్స్ లో షాపింగ్ చేసిన జనాలకు ది లెజెండ్ టికెట్లు, స్నాక్స్ కూపన్స్ తో తక్కువ రేట్లకు బహుమతిగా ఇచ్చారు. అయినప్పటికీ ఈ సినిమా ఇంకా10 శాతం కూడా రికవరీ సాధించలేదు. నాన్ థియేట్రికల్ రైట్స్ లెక్కలు పక్కన పెడితే.. ఈ మూవీ రూ.70 కోట్ల నష్టాలను మిగిల్చిందని చెప్పొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి