Thammakayalu : ఈ కాయ ఒక్కటి తీసుకుంటే.. సచ్చుబడ్డ నరాలు కూడా విజృంభిస్తాయి..!

October 5, 2022 7:54 AM

Thammakayalu : భారతీయ సంప్రదాయ అతిపురాతన వైద్యం ఆయుర్వేదం. ఈ వైద్యంలో ఉపయోగించే ఔషధాలు మొత్తం మన చుట్టు పక్కల ఉండే మొక్కల నుంచి మూలికలు, ఔషధాల ద్వారా తయారవుతూ ఉంటాయి. అయితే చాలా రకాల మూలికలు, ఔషధాల చెట్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కానీ మనకు అస్సలు తెలియదు. అలాంటి ఒక ఔషధాల గని త‌మ్మకాయలు. వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. తమ్మకాయల గురించి మనకు సరిగా తెలియకపోవచ్చు కానీ వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు తమ్మకాయలు కూరగాయల మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. పల్లెటూరులో చాలా తీగలకు కాసేసి ఎక్కడపడితే అక్కడ ఉంటాయి. తమ్మకాయలు చాలామంది తెలియక తినరు.

తమ్మకాయలను మామూలుగా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ తమ్మకాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది. ఈ తమ్మకాయల‌లో పాలు పోసి ఇగురు లేదా పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అన్ని కూరగాయలలాగే ఈ తమ్మకాయలను కూడా వాడుకోవచ్చు కాకపోతే ముదిరిపోకుండా చూసుకోవాలి. ఈ తమ్మకాయల వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవి ఏమిటంటే.. ఇందులో ముఖ్యంగా చాలామందికి కళ్ళ కింద గానీ ముఖం మీద నలుపు ఎక్కువగా రావడం, మెడ మీద నలుపు, మంగు మచ్చలు రావడం ఇవన్నీ డార్క్ స్కిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరిగి మెలనోసైట్స్ కణజాలం నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి.

Thammakayalu very healthy amazing benefits take daily
Thammakayalu

ఈ తమ్మకాయలలో ట్రిప్సీన్ హీబీటర్ ఉండి ఈ మెలనోసైట్స్ లో ఉన్న మెలనిన్‌ని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. అలాగే తమ్మకాయల్లో ఉండే ఎల్డోప‌ మరియు పాలి ఫినాల్.. ఈ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. పార్కిన్సన్ డిసీస్ వచ్చి స్ట్రెస్ వల్ల ఎక్కువగా వణుకు వచ్చేస్తూ ఉంటుంది. షివరింగ్ తగ్గించడానికి, వేళ్ళల్లో కాళ్ళల్లో పట్టు పెంచడానికి, తూలిపోకుండా బ్యాలెన్సింగ్ నేచర్ ఇవ్వడానికి అట్లాగే నరాల గ్రిప్ ని పెంచడానికి ఈ ఎల్డోప బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తమ్మకాయల కూర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment