Tees Maar Khan : టీజ‌ర్‌లోనే పాయ‌ల్ రాజ్‌పూత్ ర‌చ్చ ర‌చ్చ‌.. ఇక సినిమాలో ఎలా ఉంటుందో..?

June 18, 2022 3:31 PM

Tees Maar Khan : యంగ్ హీరో ఆది సాయికుమార్ న‌టుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈయ‌న ఖాతాలో ఒక‌టి రెండు త‌ప్ప పెద్ద‌గా హిట్స్ లేవు. అయిన‌ప్ప‌టికీ సినీ ఇండ‌స్ట్రీలో ఆది త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటూనే ఉన్నాడు. ఇక త్వ‌ర‌లోనే ఈయ‌న తీస్ మార్ ఖాన్ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి చెందిన టీజ‌ర్‌ను కొద్ది సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. ఇందులో యాక్ష‌న్ హీరోగా ఆది అద‌ర‌గొట్టేశాడు. ఇక ఆదికి జోడిగా సూపర్ గ్లామ‌ర‌స్ భామ పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టించింది.

టీజ‌ర్‌ను బట్టి చూస్తే సినిమా ఫుల్ యాక్ష‌న్‌తో నిండి ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇందులో ఆది పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక ఇందులో ఆది స‌ర‌స‌న బోల్డ్ పాత్ర‌లో పాయ‌ల్ రాజ్‌పూత్ క‌నువిందు చేసింది. టీజ‌ర్‌లో కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే అందాల ఆర‌బోత‌తో పాయ‌ల్ రాజ్‌పూత్ ర‌చ్చ చేసింది. ఇక సినిమాలో ఈమె ఎలా ఉంటుందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

Tees Maar Khan teaser launched
Tees Maar Khan

కాగా ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తుండ‌గా.. నాట‌క‌మ్ ఫేమ్ క‌ల్యాణ్‌జీ గోగ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ మూవీకి గాను చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఇందులో ఆది పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లోనే కాకుండా ఇంకో రెండు భిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నుండ‌గా.. సినిమాను వీలైనంత త్వ‌ర‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ మూవీతో అయినా ఆది ట్రాక్ లో ప‌డ‌తాడా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment