గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Tees Maar Khan Review : ఆది సాయికుమార్ న‌టించిన తీస్ మార్ ఖాన్ రివ్యూ.. సినిమా హిట్టా.. ఫ‌ట్టా.. ఎలా ఉంది..?

Tees Maar Khan Review : హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ కాంబోలో తీస్ మార్ ఖాన్ ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటివరకూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, కామెడీ ఎంటర్టైనర్, థ్రిల్లర్ మూవీలే ఎక్కువగా చేసిన…

Tees Maar Khan Review : ఆది సాయికుమార్ న‌టించిన తీస్ మార్ ఖాన్ రివ్యూ.. సినిమా హిట్టా.. ఫ‌ట్టా.. ఎలా ఉంది..?

Tees Maar Khan Review : హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ కాంబోలో తీస్ మార్ ఖాన్ ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటివరకూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, కామెడీ ఎంటర్టైనర్, థ్రిల్లర్ మూవీలే ఎక్కువగా చేసిన ఆది ఈసారి మాత్రం పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో వచ్చాడు. దర్శకుడు కళ్యాణ్ జీ గోగాన తీస్ మార్ ఖాన్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఆది సాయి కుమార్ ఈసారైనా తన తీస్ మార్ ఖాన్‌గా ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది చూద్దాం.

క‌థ..

తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) అనే ఒక కాలేజ్ స్టూడెంట్ పోలీస్ అవ్వాలి అనుకుంటాడు. ఈ క్ర‌మంలో అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటాడు. అయితే తీస్ మార్ ఖాన్ తన సోదరుడిని, తన సోదరి భర్తని కోల్పోతాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు ? తీస్ మార్ ఖాన్ తనని ఇంత ఇబ్బంది పెట్టిన వారిపై పగ తీర్చుకుంటాడా ? లేదా.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tees Maar Khan Review know how is the movie
Tees Maar Khan Review

విశ్లేషణ..

ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు ఉంటాయి. కథ, కథనం పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఆది సాయికుమార్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సినిమా మొత్తం ఆది సాయికుమార్, తన సోదరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనే విషయం మీదే నడుస్తుంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పాత్రను చిత్రీకరించిన విధానం కమర్షియల్ సినిమా టెంప్లేట్ హీరోయిన్ పాత్రలాగానే ఉంటుంది. పాటలు కూడా ఏదో సందర్భం లేకుండా వచ్చినట్టు ఉంటాయి. టెక్నికల్ గా సినిమా బాగానే ఉంటుంది. కానీ సినిమాకి ముఖ్యమైన కథ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్..

నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్..

రొటీన్ కథ, బలహీనమైన కథనం, బోరింగ్ సీన్స్, అవసరం లేకుండా వచ్చే పాటలు

రేటింగ్ : 2.5/5

చివరగా..

టెక్నికల్ గా సినిమా బాగున్నా కూడా కథ విషయంలో కొత్తదనం లోపించింది. కమర్షియల్ సినిమాలని ఎంజాయ్ చేసే వాళ్లకి తీస్ మార్ ఖాన్ ఒక్కసారి చూడగలిగే సినిమా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి