Tamannaah : టాలీవుడ్‌కు తమన్నా వచ్చి దాదాపుగా 15 ఏళ్లకు పైనే అవుతోంది. అయినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలకు మాత్రం కొదువ ఉండడం లేదు. తాజాగా ఈమె నటించిన ఎఫ్3 మూవీ విడుదల కానుంది. దీంతో ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలోనూ తమన్నా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆమె అందులో షేర్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే బ్లూ కలర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ అలరించగా.. ఇప్పుడు మళ్లీ డార్క్ రెడ్ కలర్ డ్రెస్‌లో హొయలు పోయింది. ఎఫ్3 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈమె చేసిన అందాల ప్రదర్శన మతులు పోగొడుతోంది.
తమన్నా ఆ భాష.. ఈ భాష అని లేదు.. అన్ని భాషలకు చెందిన సినిమాల్లోనూ నటించింది. ఈమె బాహుబలి మూవీలో అవంతికగా ఆకట్టుకుంది. దీంతో బాలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూ కట్టాయి. ఇక నితిన్ తో కలిసి మ్యాస్ట్రో సినిమాలో నెగెటివ్ రోల్ చేసింది. అయినప్పటికీ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక భోళా శంకర్ మూవీలో ఏకంగా మెగాస్టార్ పక్కన నటించే చాన్స్‌ను కొట్టేసింది. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయన్ ఇన్ని సంవత్సరాల నుంచి నిలదొక్కుకోవడం కష్టమే. అయినప్పటికీ తమన్నా తన సత్తా చాటుతోంది.
కాగా అనిల్ రావిపూడి దర్వకత్వంలో ఎఫ్2 మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3లో తమన్నా అందాలను ఒక రేంజ్‌లో ఆరబోసింది. ఇందులో వెంకీ సరసన నటించిన ఈ భామ ఒక రేంజ్‌లో గ్లామర్ షో చేసింది. ఈ మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో పూజా హెగ్డె ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…