Banana Milk : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో సతమతమవుతుంటే.. మరికొందరు చూడటానికి సన్నగా ఉన్నామంటూ బరువు ఎలా పెరగాలి అంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అధిక బరువు మరియు తక్కువ బరువు అనేవి రెండూ సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి మీరు సమతుల్య బరువును కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి నిత్యం చాలా కష్టపదుతుంటారు. ఆరోగ్యకరంగా బరువు పెరగాలి అంటే కండరాలకు బలాన్ని ఇచ్చే పోషక విలువలున్న ఆహారం ఎంతో అవసరం. బరువు పెరగడంలో అరటిపండు అనేది ఎంతగానో సహకరిస్తుంది.
అరటి పండు, పాలు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే అరటిపండులో పొటాషియం, విటమిన్లు, డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. పాలల్లో కూడా ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం మరియు ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి సహజసిద్ధంగా బరువు పెరగడానికి సన్నగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.
ఒక అరటి పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు పాలను పోసి బాగా మిక్సీ చేసుకోవాలి. అలా తయారైన జ్యూస్ ని గ్లాసులో పోసుకుని ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. అరటి పండుతో తయారు చేసిన ఈ పాలను ఉదయం సమయంలో తీసుకోవాలి. బరువు తక్కువగా ఉన్నవారు ఈ పాలను తాగితే కచ్చితంగా బరువు పెరుగుతారు. అరటిపండు, పాలు రెండింటిలోను కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.
అంతేకాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచటమే కాకుండా, కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. అరటిపండ్లలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో గ్లూకోజ్‌ను స్థిరంగా పంపి వర్కవుట్ చేయడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని తేమగా ఉంచి, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. 40 ఏళ్లు పైబడిన వారు ఈ పాలను వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్లకు జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది కాబట్టి. చిన్న వయసు వారు ప్రతినిత్యం అరటిపండుతో తయారుచేసిన ఈ పాలను తాగడం ద్వారా త్వరగా ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…