గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : ఇంగ్లండ్‌పై నెగ్గిన సౌతాఫ్రికా..!

T20 World Cup 2021 : షార్జాలో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2021 టోర్నీ 39వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా గెలుపొందింది. సౌతాఫ్రికా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ కొన్ని ప‌రుగుల దూరంలో ఆగిపోయింది.…

T20 World Cup 2021 : ఇంగ్లండ్‌పై నెగ్గిన సౌతాఫ్రికా..!

T20 World Cup 2021 : షార్జాలో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2021 టోర్నీ 39వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా గెలుపొందింది. సౌతాఫ్రికా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ కొన్ని ప‌రుగుల దూరంలో ఆగిపోయింది. చివ‌రి వ‌ర‌కు కష్ట‌ప‌డినా ఇంగ్లండ్‌కు గెలుపు ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా 10 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 south africa won by 10 runs against england in 39th match

మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగుల స్కోరు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ల‌లో రాసీ వ‌న్ డ‌ర్ డుస్సెన్ 60 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 94 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఎయిడెన్ మార్క‌ర‌మ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 52 ప‌రుగులు చేయ‌గా, క్వింట‌న్ డికాక్ 27 బంతుల్లో 4 ఫోర్ల‌తో 34 ప‌రుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో మొయిన్ అలీ, ఆదిల్ ర‌షీద్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 179 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్‌ల‌లో మొయిన్ అలీ 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 37 ప‌రుగులు చేయ‌గా, డేవిడ్ మ‌ల‌న్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేశాడు. అలాగే లియామ్ లివింగ్ స్టోన్ 17 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స‌ర్‌ల‌తో 28 ప‌రుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో ర‌బాడా 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌బ్రెయిజ్ శంషీ, డ్వానె ప్రిటోరియ‌స్‌ల‌కు 2 వికెట్ల చొప్పున ద‌క్కాయి. ఆన్‌రిచ్ నోర్‌జె 1 వికెట్ తీశాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి