గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : కోహ్లి.. నువ్వు ఇంక క్రికెట్‌కు ప‌నికిరావు.. వెళ్లిపో.. భార‌త్ ప‌రువు మొత్తం పోయింది..

T20 World Cup 2021 : కోహ్లి.. నీ మీద‌, నీ నాయ‌క‌త్వంలో ఉన్న టీమ్ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాం.. 130 కోట్ల మంది భార‌తీయులు మీరు క‌ప్ తెస్తార‌ని ఆశ‌గా ఎదురు చూశారు. 2007 నాటి…

T20 World Cup 2021 : కోహ్లి.. నువ్వు ఇంక క్రికెట్‌కు ప‌నికిరావు.. వెళ్లిపో.. భార‌త్ ప‌రువు మొత్తం పోయింది..

T20 World Cup 2021 : కోహ్లి.. నీ మీద‌, నీ నాయ‌క‌త్వంలో ఉన్న టీమ్ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాం.. 130 కోట్ల మంది భార‌తీయులు మీరు క‌ప్ తెస్తార‌ని ఆశ‌గా ఎదురు చూశారు. 2007 నాటి ఫ‌లితం పునరావృతం కాకూడ‌ద‌ని కోరుకున్నాం. కానీ మీరు చేసిందేమిటి. మ‌ళ్లీ అదే నిర్ల‌క్ష్యం. ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడుతున్నామ‌న్న సోయి ఇంత కూడా లేదు. మీరు క్రికెట్ ఆడ‌డం శుద్ధ దండ‌గ‌.. వెళ్లి ఐపీఎల్ ఆడుకోండి.. కోహ్లి నువ్వు క్రికెట్‌కు ప‌నికిరావు, రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ అప్ప‌గించి వెళ్లిపో..

T20 World Cup 2021 newzealand won by 8 wickets against india in 28th match

పైన‌వ‌న్నీ మేం అంటున్న‌వి కాదు.. ఓట‌మి ప‌రాభ‌వంతో.. ఆగ్ర‌హంతో.. అభిమానుల నోళ్ల నుంచి వ‌స్తున్న మాట‌లు. అవును.. చావో రేవో.. తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో.. గ‌ల్లీ స్థాయి క్రికెట్ ఆడారు. కొంచెం కూడా శ్ర‌ద్ధ లేకుండా, బాధ్య‌త అస‌లే లేకుండా మ్యాచ్ ఆడారు. ఫ‌లితం.. పాక్ తో ఆడిన మ్యాచ్ క‌న్నా ఇంకా దారుణ ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్నారు. దీంతో భారత్ సెమీస్ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. కోట్లాది అభిమానుల ఆశ‌లు అడియాశ‌లయ్యాయి.

ఐపీఎల్‌లో ఆడిన మెరిక‌ల్లాంటి ప్లేయ‌ర్లు ఉన్నారు, జ‌ట్టు దుర్భేధ్యంగా ఉంది.. ఈసారి క‌ప్ మ‌న‌దే.. అనుకున్నారు. కానీ అభిమానుల ఆలోచ‌న‌ల‌ను ప‌టాపంచ‌లు చేశారు. చిత్తుగా ఓడిపోయారు. క‌నీసం పోరాట ప‌టిమ‌ను కూడా ప్ర‌ద‌ర్శించ‌లేదు. దీంతో అభిమానుల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. కెప్టెన్ కోహ్లి, కోచ్ ర‌విశాస్త్రి, బీసీసీఐ, సెలెక్ష‌న్ క‌మిటీల‌ను ఏకి పారేస్తున్నారు.

స్కోర్ల వివ‌రాలు : భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో స్కోరు – 110/7, న్యూజిలాండ్ స్కోరు – 14.3 ఓవ‌ర్ల‌లో 111/2

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి