గురువారం, జూన్ 11, 2026
క్రీడ‌లు

T20 World Cup 2021 : ప‌సికూన స్కాట్లండ్‌పై భార‌త్ స్వైర విహారం.. బంప‌ర్ విక్ట‌రీ..!

T20 World Cup 2021 : దుబాయ్‌లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 37వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఛేదించింది.…

T20 World Cup 2021 : ప‌సికూన స్కాట్లండ్‌పై భార‌త్ స్వైర విహారం.. బంప‌ర్ విక్ట‌రీ..!

T20 World Cup 2021 : దుబాయ్‌లో జ‌రిగిన ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 టోర్నీ 37వ మ్యాచ్‌లో స్కాట్లండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. స్కాట్లండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త్ చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఛేదించింది. 86 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 6.3 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ సాధించింది. దీంతో స్కాట్లండ్‌పై 8 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

T20 World Cup 2021 india won by 8 wickets against scotland in 37th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. స్కాట్లండ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు 17.4 ఓవ‌ర్ల‌లోనే కేవ‌లం 85 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్‌ల‌లో జార్జ్ మున్సీ 24 ప‌రుగులు, మైకేల్ లియాస్క్ 21 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌నిపించారు. మిగిలిన ఎవ‌రూ చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, ర‌వీంద్ర జ‌డేజాలు చెరో 3 వికెట్ల‌ను తీశారు. జ‌స్‌ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 1 వికెట్ తీశారు.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన భార‌త్ 6.3 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. 2 వికెట్ల‌ను కోల్పోయి 89 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట్స్‌మెన్‌ల‌లో కేఎల్ రాహుల్ 50 ప‌రుగుల‌తో చెల‌రేగిపోయాడు. రోహిత్ శ‌ర్మ 30 ప‌రుగులు చేశాడు. స్కాట్లండ్ బౌల‌ర్ల‌లో మార్క్ వాట్‌, బ్రాడ్ వియ‌ల్‌లు చెరొక వికెట్ తీశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి