గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Aparna : సుందరకాండ హీరోయిన్ అపర్ణ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Aparna : ఎంతోమంది నటీనటులు తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతారు. వారు చేసింది ఒక చిత్రమే అయినా కూడా వారి నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా గుర్తుండిపోయే…

Aparna : సుందరకాండ హీరోయిన్ అపర్ణ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Aparna : ఎంతోమంది నటీనటులు తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతారు. వారు చేసింది ఒక చిత్రమే అయినా కూడా వారి నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా గుర్తుండిపోయే వారిలో వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సెకండ్ హీరోయిన్ అపర్ణ కూడా ఒకరు అని చెప్పచ్చు. సుందరకాండ సినిమాలో వెంకటేష్ తెలుగు లెక్చ‌రర్ గా నటించారు.

ఈ చిత్రంలో లెక్చ‌రర్ ను ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ నటించడం జరిగింది. ఇక ఈ పాత్ర కోసం మొదట‌గా రాఘవేంద్ర రావు స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నారు.  కానీ కొత్త అమ్మాయి అయితే పాత్రకు బాగుంటుందని భావించి అపర్ణను తీసుకున్నారట. ఒక రోజు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు నిర్మాత కెవివి సత్యనారాయణ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనను ఒక అమ్మాయి బాగా ఆకర్షించింది.

Sundarakanda movie actress Aparna see how is she now
Aparna

ఆమెను చూసిన రాఘవేంద్రరావు ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంది మనం చిత్రంలోని క్యారెక్టర్ కి సరిపోతుంది వెంటనే ఓకే చేసేయండి అని చెప్పారట. కానీ అపర్ణకు యాక్టింగ్ వచ్చా..రాదా.. అంటూ అందరు చాలా టెన్షన్ పడ్డారు. కానీ సుందరాకాండ చిత్రంలో అపర్ణ ఎంతో అద్భుతంగా నటించింది. హీరోయిన్ మీనా కంటే అపర్ణ నటన అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగింది.

ఈ సినిమా తర్వాత ఆమెకు హీరోయిన్ గా ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆమె కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఆ తరువాత అపర్ణ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే సినిమాలో నటించడం జరిగింది. ఈ చిత్రం తర్వాత అపర్ణ తెలుగు తెరపై కనుమరుగైపోయింది. ఇక అపర్ణ 2002 లో వివాహం చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూ ద్వారా అపర్ణ మళ్లీ ప్రేక్షకుల‌కు కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అపర్ణకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి