గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Sugar Palm Fruit : తాటి ముంజలతో ఎన్నో లాభాలు.. వీటిని రోజుకు ఎన్ని తినాలి..?

Sugar Palm Fruit : మనకు ఏడాది పొడవునా పలు సీజన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో సీజన్‌లో మనకు వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ఇక వేసవిలోనూ పలు రకాల పండ్లు లభిస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది…

Sugar Palm Fruit : తాటి ముంజలతో ఎన్నో లాభాలు.. వీటిని రోజుకు ఎన్ని తినాలి..?

Sugar Palm Fruit : మనకు ఏడాది పొడవునా పలు సీజన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒక్కో సీజన్‌లో మనకు వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ఇక వేసవిలోనూ పలు రకాల పండ్లు లభిస్తుంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాయి. కానీ వాటిని పండ్లు అని అనలేరు. ఎందుకంటే అవి తాటి ముంజలు మరి. అవును.. వీటిని పండ్లు.. అని అనలేం. కానీ వీటితోనూ మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో లభించే తాటి ముంజలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తాటి ముంజలు మనకు చలవ చేస్తాయి. వేసవిలో శరీర తాపాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. కనుక వీటిని రోజూ తినాల్సిందే. అయితే ఎక్కువగా తింటే మలబద్దకం వస్తుంది. కనుక వీటిని మూడు లేదా నాలుగుకు మించి తినరాదు. ఇక వీటిల్లో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటిచూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుంది. కాబట్టి కళ్లకు తాటి ముంజలు మంచి ఆహారం అని చెప్పవచ్చు.

Sugar Palm Fruit benefits how many we have to take
Sugar Palm Fruit

తాటి ముంజల్లో విటమిన్‌ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది చర్మాన్ని, వెంట్రుకలను సంరక్షిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. వీటిల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది కనుక వీటిని తింటే రక్తం అధికంగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే తాటి ముంజల్లో ఉండే జింక్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలను పోగొడుతుంది. వీర్యం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.

తాటి ముంజలను మోతాదులో తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్‌, కడుపులో మంట తగ్గుతాయి. అదే మోతాదుకు మించితే మలబద్దకం వస్తుంది. కనుక ముంజలను తక్కువ మోతాదులో తినాలి. వీటిని తింట మొటిమలు కూడా తగ్గుతాయి. కనుక ఈ సీజన్‌లో వీటిని తప్పక ఆహారంలో భాగం చేసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి