గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Star Couples : పెద్దలను ఒప్పించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఆ ఐదు స్టార్ జంటలు వీళ్లే.!

Star Couples : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణం. చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వస్తాయో…

Star Couples : పెద్దలను ఒప్పించి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన ఆ ఐదు స్టార్ జంటలు వీళ్లే.!

Star Couples : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణం. చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ తర్వాత కాలంలో వాళ్ల మధ్య ఎలాంటి మనస్పర్థలు వస్తాయో తెలియదు కానీ విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇస్తారు. ఇలా సినీ ఇండస్ట్రీలో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐదు స్టార్ జంటలు ఏవో  చూద్దాం. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌రువాత 1997లో మొద‌టిసారిగా నందినిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బద్రి చిత్రంతో పరిచయమైన రేణుదేశాయ్‌ తో రిలేష‌న్ షిప్‌ ప్రారంభించారు.

2007లో త‌న మొద‌టి భార్య‌ నందినికి విడాకులు ఇచ్చి 2009 జనవరిలో రేణుదేశాయ్ ని వివాహం చేసుకున్నారు. ఆ త‌రువాత 2012లో రేణుదేశాయ్‌కు కూడా విడాకులు ఇచ్చారు. 2013 నవంబర్ లో ర‌ష్యాకు చెందిన అన్నా లెజినివాను మూడ‌వ వివాహం చేసుకున్నారు ప‌వ‌న్ కళ్యాణ్. 2010లో ఏ మాయ చేసావే చిత్రంలో నటించిన  నాగచైతన్య, సమంత పరిచయం ప్రేమగా మారి 2017 అక్టోబర్ లో ఇరు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా గోవాలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో సమంత, చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకుని వివాహ బంధానికి స్వస్తి చెప్పారు.

Star Couples who married by parents decision took divorce later
Star Couples

అక్కినేని కుటుంబానికే చెందిన మరో హీరో సుమంత్ కూడా తొలిప్రేమ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి 2004 లో వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట కూడా 2006లో విడాకులు తీసుకుని వివాహబంధానికి ముగింపు చెప్పారు. కీర్తిరెడ్డి ఆ తర్వాత వివాహం చేసుకొని యుఎస్ఎలో సెటిలైపోయింది. హీరో సుమంత్ మాత్రం ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే జీవితం గడుపుతున్నారు.

హీరో సిద్దార్థ్ మేఘ‌న‌ను ప్రేమించి 2003లో వివాహం చేసుకున్నారు. ఆ త‌రువాత కొన్ని కారణాల వలన  విడివిడిగా జీవితం ప్రారంభించి 2007లో విడాకులు తీసుకున్నారు ఈ జంట‌. ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, నిర్మాత కే.రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాశ్ కోవెల‌మూడి ర‌చ‌యిత్రి స్క్రీన్ రైట‌ర్ అయిన‌ క‌నికా ధిల్లాన్‌ ను ప్రేమించి 2014లో వివాహం చేసుకున్నాడు.  2017లో ప్ర‌కాశ్‌కు విడాకులు ఇచ్చి 2021లో హిమాన్షు శ‌ర్మ‌ను పెళ్లాడింది క‌నికా ధిల్లాన్‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి