SS Rajamouli : ఎన్టీఆర్‌ని మొద‌ట చూసి చాలా బాధ‌ప‌డ్డ రాజ‌మౌళి.. ఎందుకో తెలుసా ?

November 27, 2021 3:41 PM

SS Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. ఇంతవరకు ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆయన కెరీర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టూడెంట్ నంబర్ వన్ అనే సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించారు. ఈ సినిమాతోనే రాజమౌళి తన స్పెషల్ మార్క్ ని ప్రజంట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ వెనుక చాలా కష్టం ఉంది. మొదటగా ఎస్ఎస్ రాజమౌళి.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

SS Rajamouli : ఎన్టీఆర్‌ని మొద‌ట చూసి చాలా బాధ‌ప‌డ్డ రాజ‌మౌళి.. ఎందుకో తెలుసా ?
SS Rajamouli :

రాజమౌళి స్కిల్ ను చూసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ ఓ సీరియల్ లో వర్క్ చేయాలని సూచించిన రాఘవేంద్రరావు మాట కాదనలేక కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి పని చేసే అవకాశాన్ని కల్పించారట. అయితే ఫస్ట్ లో ఎన్టీఆర్ ని చూసినప్పుడు తాను ఓ మంచి హ్యాండ్సమ్ హీరోతో వర్క్ చేయాలని అనుకుంటే ఇదేంటి ఇలా అయ్యిందని రాజమౌళి కాస్త బాధపడ్డారట. అయితే షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎన్టీఆర్ కమ్మిట్ మెంట్, స్టైల్, డాన్స్ చూసి ఫిదా అయ్యారట.

ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక రిలీజ్ చేస్తే ఇండస్ట్రీలో మంచి హిట్ సినిమా ఇచ్చారని రాజమౌళిని పొగిడారట. కోటి ఎనభై లక్షల రూపాయలతో రూపొందించిన సినిమాకు ఏకంగా రూ.12 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యిందట.

ఇక డైరెక్టర్ గా రాజమౌళికి, హీరోగా ఎన్టీఆర్ కు సరైన మార్క్ క్రియేట్ అయ్యింది. వీరిద్దరి లైఫ్ లో బిగ్గెస్ట్ టర్న్ గా నిలిచింది. రాజమౌళి ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ని చూసినప్పుడు అలా అనుకోకుండా ఉండాల్సిందని చాలాసార్లు అనుకున్నారట.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment