Sri Lakshmi : ఎంతో మందిని క‌డుపుబ్బా న‌వ్వించిన శ్రీ‌లక్ష్మి.. ఆమె జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా..?

July 21, 2022 5:29 PM

Sri Lakshmi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె ముఖం చూస్తేనే న‌వ్వుకు ప్ర‌తిరూపంగా క‌నిపిస్తుంది. ఈమె అనేక సినిమాల్లో బ్ర‌హ్మానందంతో క‌లిసి పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. అనేక చిత్రాల్లో ఈమె చ‌క్క‌ని క‌మెడియ‌న్ గా గుర్తింపు పొందారు. ఇప్ప‌టికీ ప‌లు సినిమాల‌లో, సీరియ‌ల్స్‌లో న‌టిస్తూనే ఉన్నారు. ఇక ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న శ్రీ‌దేవి డ్రామా కంపెనీ, జ‌బ‌ర్ద‌స్త్ వంటి షోల‌లోనూ ఈమె క‌నిపిస్తున్నారు.

అయితే శ్రీ‌ల‌క్ష్మి ఎంతో మందిని క‌డుపుబ్బా న‌వ్వించారు. కానీ ఆమె జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగి ఉంద‌న్న సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌దు. ఆమె తండ్రి అమ‌ర్‌నాథ్. అప్ప‌ట్లో నిర్మాత‌. కానీ వీరి కుటుంబం ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకుపోయింది. దీంతో సినిమాల్లో న‌టించి కుటుంబాన్ని గ‌ట్టెక్కించాల‌నే అప్ప‌ట్లో తాప‌త్ర‌య ప‌డింది. అయితే ఆమె గ‌ర్భం ధ‌రించిన‌ప్ప‌టికీ కుటుంబ బాధ్య‌త‌లు ఉన్నందున పిల్ల‌లు వ‌ద్ద‌నుకుంది. త‌రువాత క‌న‌వ‌చ్చులే క‌దా అని అనుకుంది. కానీ అదే ఆమెకు శాప‌మైంది. ఆమెకు పిల్ల‌లు లేకుండా పోయారు.

Sri Lakshmi made us laugh but she has sad story
Sri Lakshmi

అప్ప‌ట్లో ఈమె చేసిన త‌ప్పుకు ఈమెకు మ‌ళ్లీ పిల్ల‌లు క‌ల‌గ‌లేదు. అనారోగ్య స‌మ‌స్య‌లు, థైరాయిడ్ బాధించాయి. దీంతో పిల్ల‌లు క‌ల‌గ‌లేదు. అదొక్క‌టే త‌న‌కు తీర‌ని విషాదం అని ఈమె చెబుతుంటుంది. ఇక ఈమె సోద‌రుడు రాజేష్ హీరోగా న‌టించారు. ఈయ‌న కుమార్తె ఐశ్వ‌ర్యా రాజేష్ ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తోంది. ఇలా అంద‌రినీ ఎంతో క‌డుపుబ్బా న‌వ్వించిన శ్రీ‌ల‌క్ష్మి జీవితంలో ఇంత‌టి విషాదం ఉంద‌న్న సంగతి ఇంకా ఇప్ప‌టికీ చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఆమె గురించి తెలిసిన వారు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment