గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sri Devi Soda Center : దీపావళి కానుకగా ఓటీటీలో సందడి చేయనున్న శ్రీదేవి సోడా సెంటర్..!

Sri Devi Soda Center : ఒకానొక సమయంలో థియేటర్లో సినిమాలు చూడటం మిస్ అయితే ఆ సినిమాలు టెలివిజన్ లో ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎన్నో మార్పులు…

Sri Devi Soda Center : దీపావళి కానుకగా ఓటీటీలో సందడి చేయనున్న శ్రీదేవి సోడా సెంటర్..!

Sri Devi Soda Center : ఒకానొక సమయంలో థియేటర్లో సినిమాలు చూడటం మిస్ అయితే ఆ సినిమాలు టెలివిజన్ లో ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలలో విడుదల అవుతుండగా, మరికొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదలై కొన్ని నెలలకే ఓటీటీలో విడుదల అవుతుండడంతో ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలను చూసే వెసులుబాటు కూడా ఏర్పడింది.

Sri Devi Soda Center  is releasing on OTT

ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక సుధీర్ బాబు హీరోగా పలాస ఫేమ్ డైరెక్టర్ కరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా థియేటర్ లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్దమవుతోంది.

ఈ సినిమాకు గాను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ నిర్వాహకులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. థియేటర్ లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతూ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో వేచిచూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి