గురువారం, జూన్ 11, 2026
ఆధ్యాత్మికం

Spoiled Coconut In Pooja : పూజ సమయంలో కొట్టిన‌ కొబ్బరికాయ కుళ్ళిపోయిందా.. అయితే దాని అర్థం ఏమిటి..?

Spoiled Coconut In Pooja : సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ.…

Spoiled Coconut In Pooja : పూజ సమయంలో కొట్టిన‌ కొబ్బరికాయ కుళ్ళిపోయిందా.. అయితే దాని అర్థం ఏమిటి..?

Spoiled Coconut In Pooja : సాధారణంగా భారతీయ సంప్రదాయాల ప్రకారం ఎక్కువగా దైవభక్తిని నమ్ముతారు. దైవానికి ఇచ్చినంత వ్యాల్యూ మరొకదానికి ఇవ్వరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు ముఖ్యంగా తీసుకెళ్ళేది కొబ్బరికాయ. సాధారణంగా కొబ్బరికాయలు మనం ఎప్పుడైనా కొట్టినప్పుడు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి. ఇలా జరగడం కొంతమంది అరిష్టంగా భావిస్తూ ఉంటారు. ఇలా కొట్టినప్పుడు అందులో నీళ్లు లేకపోవడం పూర్తిగా కుళ్లిపోవడం చూసి చాలా మంది ఏదో జరిగిపోతుంద‌ని కంగారు పడుతూ ఉంటారు.

దైవం కోసం చేసిన పూజలో ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటారు. ఇలా జరగడం అశుభంగా భావిస్తారు. సాధారణంగా కొబ్బరికాయ కుళ్ళిపోవడం సహజమే. దాన్ని అశుభ సూచకంగా భావించవలసి అవసరం ఏమీ లేదు. దేవాలయాల్లో కానీ ఇత‌ర ఏదైనా శుభ కార్యాల్లో కానీ కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే కాయ కుళ్ళి పోలేదని మనపై ఉన్న కుళ్ళు, దిష్టి పోయాయ‌ని అర్థం చేసుకోవాలి. అంటే మనకు జరగబోయే కీడు తొలగిపోతుందని అర్థం. మ‌న‌కు కీడు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఆ కీడు అనేది కుళ్లిన కాయ రూపంలోనే వెళ్లిపోయిందని చెబుతారు.

Spoiled Coconut In Pooja what happens
Spoiled Coconut In Pooja

కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు జరుగుతుంది అనుకోవడం ఒక మానసిక బలహీనతగా భావించాలి తప్ప మరో విధంగా అర్థం చేసుకోకూడదని అంటారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు అని శాస్త్రాల్లో పురాణాల్లో దీనికి ఆధారాలు లేవు. మనం చేసే పూజలో నిష్ట ఉంటే ఇలాంటి సందేహాలు ఉత్పన్నం కావని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొట్టిన కొబ్బరికాయ కుళ్ళి పోయినా నీళ్లు లేక పోయినా ఎలాంటి కీడు జరగదని వారంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి