గురువారం, జూన్ 11, 2026
క్రైమ్‌

తెలిసిన వ్యక్తితో వచ్చిన వితంతువు.. అక్రమ సంబంధం అంటగట్టి చితకబాదిన బంధువులు..

భర్త చనిపోయిన ఓ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు చేస్తూ గ్రామస్తులు సదరు మహిళను కొట్టడమే కాకుండా, ఆమెకు శిరోముండనం చేసి దారుణంగా అవమానించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల…

తెలిసిన వ్యక్తితో వచ్చిన వితంతువు.. అక్రమ సంబంధం అంటగట్టి చితకబాదిన బంధువులు..

భర్త చనిపోయిన ఓ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు చేస్తూ గ్రామస్తులు సదరు మహిళను కొట్టడమే కాకుండా, ఆమెకు శిరోముండనం చేసి దారుణంగా అవమానించిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌లోని శబర్‌కాంత జిల్లాలోని సంచేరి గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇటీవలే భర్త చనిపోయాడు.ఈ క్రమంలోనే తన నలుగురు పిల్లలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.

ఈ క్రమంలోనే బ్యాంకు పని నిమిత్తం హిమ్మత్‌నగర్‌ వెళ్లిన ఆ వితంతువు తిరిగి ప్రయాణంలో తనకు తెలిసిన వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చింది.ఈ క్రమంలోనే అదే గ్రామస్తులు తనని అడ్డుకుని వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందంటూ ఆరోపించిన వారిద్దరిని గ్రామానికి తీసుకువెళ్ళి సదరు మహిళ పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను చితకబాది శిరోముండన చేశారు.

ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఆమెపై దాడికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో భాగంగా బైక్ పై ఎక్కించుకుని వచ్చిన వ్యక్తి నిందితుల్లో ఒకరి సోదరికి భర్తగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిద్దరికీ అక్రమ సంబంధం ఉందన్న కారణంగా వారిపట్ల ఈ విధంగా ప్రవర్తించారని పోలీసులు పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి