గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shriya Sharma : జైచిరంజీవ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Shriya Sharma : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేన‌కోడ‌లిగా న‌టించిన శ్రియా శ‌ర్మ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన భూమిక‌, స‌మీరా రెడ్డి హీరోయిన్లుగా న‌టించారు. చిత్రంలో చిరంజీవి మేనకోడలు…

Shriya Sharma : జైచిరంజీవ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Shriya Sharma : మెగాస్టార్ చిరంజీవి న‌టించిన జై చిరంజీవ సినిమాలో మెగాస్టార్ మేన‌కోడ‌లిగా న‌టించిన శ్రియా శ‌ర్మ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన భూమిక‌, స‌మీరా రెడ్డి హీరోయిన్లుగా న‌టించారు. చిత్రంలో చిరంజీవి మేనకోడలు ఒక చిన్నారి పాప ఎంతో అద్భుతంగా నటించింది. ఆ చిన్నారి పాప పేరు శ్రీ‌య శర్మ. శ్రీ‌య శర్మ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వు నేను ప్రేమ చిత్రంతో శ్రీ‌య‌శ‌ర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. అయితే ఆ చిత్రంలో సూర్య, జ్యోతిక కూతురిగా న‌టించింది శ్రీ‌య.

ఆ త‌రువాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగుతోపాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ ఇలా దాదాపు అన్ని భాష‌ల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న‌ది. టాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన‌ మ‌హేష్‌బాబు సినిమా దూకుడు చిత్రంలో కూడా స‌మంత చెల్లి పాత్ర‌లో న‌టించింది. అదేవిధంగా తెలుగు సినిమాలు అయిన ర‌చ్చ‌, తూనీగ తూనీగ‌ వంటి సినిమాల్లో టీనేజీ అమ్మాయిగా క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

Shriya Sharma in Jai Chiranjeeva movie see how is she now
Shriya Sharma

టీనేజ్ అమ్మాయి పాత్ర‌లు చేస్తున్న స‌మ‌యంలోనే హీరోయిన్‌గా చేసే చాన్స్  వ‌చ్చింది. అదేవిధంగా 2014లో బిగ్‌బాస్‌తో ఫేమ‌స్ అయిన‌ అలీరాజా హీరోగా తెర‌కెక్కిన గాయ‌కుడు సినిమాలో  శ్రీయ‌శ‌ర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ గాయ‌కుడు సినిమా ఆశించిన విజ‌యం విజయం సాధించలేకపోయింది. ఆ త‌రువాత హీరో శ్రీ‌కాంత్ తనయుడు రోష‌న్‌కు జోడీగా నిర్మ‌ల కాన్వెంట్ అనే చిత్రంలో కూడా న‌టించింది.

ఆ చిత్రం త‌రువాత శ్రీయశ‌ర్మ త‌న దృష్టిని మోడ‌లింగ్‌పై పెట్టింది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీయ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోల‌ను అభిమానుల‌తో షేర్ చేసుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తన గ్లామర్ ఫోటోస్ తో అందరినీ ఆకట్టుకున్నా కూడా శ్రీయశ‌ర్మకు మాత్రం సినిమాల్లో మంచి అవకాశాలు దక్కడం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి