గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Seetimaarr : సూప‌ర్ హిట్ మూవీ ఓటీటీలో రాబోతోంది.. రిలీజ్ ఎప్పుడంటే..!

Seetimaarr : క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రం సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల…

Seetimaarr : సూప‌ర్ హిట్ మూవీ ఓటీటీలో రాబోతోంది.. రిలీజ్ ఎప్పుడంటే..!

Seetimaarr : క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రం సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్‌ (కార్తీక్‌), తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్‌గా తమన్నా (జ్వాలారెడ్డి) నటించారు. భూమిక కీలక పాత్ర పోషించారు.

Seetimaarr is coming on ott know the date

సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ అనంతరం అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా సిటీమార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను కాస్త ఆలస్యంగా హాట్ స్టార్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గడంతో ఈనెల 15న దసరా సందర్భంగా హాట్ స్టార్ లో సీటీమార్ రాబోతుంది. ఇక పండుగ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం దొర‌కడం ఖాయంగా క‌నిపిస్తుంది.

సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సీటీమార్ సెప్టెంబ‌ర్ 10న విడుదలైంది. థియేటర్లో విడుదులైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. గోపిచంద్- సంప‌త్ నంది కాంబోలో వ‌చ్చిన ‘గౌతమ్‌ నంద’ మా అంచనాలు అందుకోలేకపోయింది. ‘సీటీమార్‌’తో గోపీచంద్‌ బాకీ తీర్చేసుకున్నాను’’ అన్నారు గోపిచంద్.

గోపిచంద్ న‌టించిన మ‌రో చిత్రం ఆర‌డుగుల బుల్లెట్‌. ఈ శుక్రవారం చిత్రం విడుద‌లైన విషయం తెలిసిందే. బి.గోపాల్ దర్శకత్వం లో నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 2017 లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆర్థిక కారణాల వలన సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్ట‌కేల‌కు విడుద‌లైన ఈ చిత్రం పెద్ద‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి