గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..

Samyuktha Hegde : కన్నడ నాట వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్తా హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య అనే పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే…

Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..

Samyuktha Hegde : కన్నడ నాట వివాదాస్పద హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్తా హెగ్డే తెలుగులో కిరాక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో సత్య అనే పాత్రతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే నాగార్జున హీరోగా రాహుల్ ర‌వీంద్ర‌న్ డైర‌క్ష‌న్ లో వ‌చ్చిన మ‌న్మ‌థుడు 2 లో కూడా న‌టించింది. ఈమె కాలేజ్ కుమార్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది. మొన్నా మధ్య ఆహాలో రిలీజ్ అయిన తమిళ డబ్బింగ్ సినిమా మన్మథ లీలైలో కూడా నటించింది.

ఇప్పటివరకు సంయుక్త తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 12కి పైగా సినిమాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ హాట్ ఫోటో షూట్‌లు, వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అయితే 17 జులై 1998 బెంగళూరులో జన్మించిన సంయుక్త మంచి ప్రొఫెషనల్ డాన్సర్. బీఏ సైకాలజీ చదువుతుండగా మధ్యలోనే ఆపేసి యాక్టింగ్ మరియు డాన్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. తాను నటించిన కిరాక్ పార్టీ అనే కన్న‌డ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును గెలుచుకుంది.

Samyuktha Hegde latest dance video viral
Samyuktha Hegde

సంయుక్త‌కి డాన్స్ అంటే పిచ్చి.. తన డాన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ప్ర‌స్తుతం సంయుక్తకి సంబంధించిన డ్యాన్స్ వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పాట‌కు డ్యాన్స్ చేస్తూ న‌డుము తెగ తిప్పేస్తూ.. ఎద అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించేస్తోంది. ఈ వీడియో త‌న ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేయ‌గానే లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం సంయుక్త హాట్ డాన్స్ పై మీరు ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి