గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత టాటూల‌పై జ‌రుగుతున్న పెద్ద చ‌ర్చ‌.. ఉంచుతుందా, చెరిపేస్తుందా ?

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉన్న నాగ చైత‌న్య‌ – స‌మంత జంట అక్టోబ‌ర్ 2న విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో ఇప్పుడు చై-సామ్‌ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. అసలు వీళ్లు…

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత టాటూల‌పై జ‌రుగుతున్న పెద్ద చ‌ర్చ‌.. ఉంచుతుందా, చెరిపేస్తుందా ?

Samantha : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉన్న నాగ చైత‌న్య‌ – స‌మంత జంట అక్టోబ‌ర్ 2న విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో ఇప్పుడు చై-సామ్‌ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు ? మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట బ్రేకప్‌ చెప్పుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప‌లు కార‌ణాలు చెబుతున్నా వాటిలో నిజం లేద‌ని తెలుస్తోంది.

Samantha would remove the tattoos or not

అయితే చైతూతో అన్యోన్యంగా ఉన్న‌ప్పుడు స‌మంత ప‌లుచోట్ల టాటూలు వేయించుకుంది. మ‌రి విడిపోయిన నేప‌థ్యంలో ఆ టాటూలు స‌మంత ఉంచుకుంటుందా, తీసేస్తుందా అనే చ‌ర్చ న‌డుస్తోంది. సమంత మూడు టాటూలు వేయించుకోగా, అవి మూడు కూడా చైతన్యకు సంబంధించిన కావడం విశేషం. మొదటగా తాను చైతుని కలిసిన ‘ఏం మాయ చేశావే’ సినిమాకు గుర్తుగా వీపుపై ‘వైఎంసీ’ అనే టాటూ వేయుంచుకుంది.

Samantha would remove the tattoos or not

అంతేకాక ఆమె కుడి చేయి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. అదే టాటూ చైకి కూడా ఉంటుంది. దీంతో పాటు సమంత తన రైట్ రిబ్‌పై ‘చై’ అనే టాటూ కూడా వేయించుకుంది. నడుము వెనుక భాగంలో మరొక పచ్చబొట్టు ఉంది, ఇది ఎరుపు రంగు గులాబీలా ఉంటుంది. దీని గురించి ఎవ‌రికీ ఐడియా లేదు.

Samantha would remove the tattoos or not

గ‌తంలో దీపికా ప‌దుకొణే కూడా త‌న చేతిపై టాటూ వేయించుకుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో ప్రేమ‌లో ఉన్న స‌మ‌యంలో అతని పేరు టాటూ వేయించుకుంది. విడిపోయిన త‌ర్వాత చెరిపేసుకుంది. న‌య‌న‌తార కూడా ప్ర‌భుదేవా టాటూ వేయించుకోగా, దానిని పాజిటివిటీగా మార్చేసింది. ఇలా స‌మంత కూడా త‌న టాటూల‌ను మార్చేస్తుందా, చెరిపేస్తుందా అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి