Samantha : స‌మంత ఫోన్‌లో ఆ యాప్స్‌.. చైతూ నుంచి విడిపోయాక అవే ప్ర‌శాంతంగా ఉంచుతున్నాయ‌ని చెప్పింది..!

October 19, 2021 10:55 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడిపోయాక స‌మంత కొద్ది రోజుల పాటు కాలు బ‌య‌ట పెట్ట‌లేదు. కానీ మొన్నీ మ‌ధ్యే ఎన్టీఆర్ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో క‌నిపించి సంద‌డి చేసింది. అందులో తార‌క్‌తో క‌లిసి స‌మంత స‌ర‌దాగా పార్టిసిపేట్ చేసింది. అయితే షోలో మునుప‌టి ఉత్సాహం ఆమెలో క‌నిపించ‌లేదు. వాడిపోయిన‌ట్లు ముఖం క‌నిపించింది.

Samantha using calming apps for mental relief after divorce

ఇక ఇటీవలే స‌మంత బ‌య‌ట పార్కుల్లో ఆహ్లాదంగా గ‌డుపుతున్న‌ట్లు తెలుస్తోంది. చైతూ నుంచి విడిపోయాక మాన‌సిక ప్ర‌శాంత‌త క‌రువైంద‌ని, అందువ‌ల్లే ఆమె ఆ విధంగా ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో గ‌డుపుతుంద‌ని తెలుస్తోంది.

ఇక ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోలో స‌మంత‌ను ఎన్‌టీఆర్ కొన్ని ప్ర‌శ్న‌లు అడిగారు. మీ ఫోన్ లో క్విజ్ యాప్స్ ఉంటాయా ? అని తార‌క్ అడ‌గ్గా.. అందుకు స‌మంత బ‌దులిస్తూ.. గతంలో ఉండేవ‌ని.. కానీ ఇప్పుడు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను అందించే calming apps ను ఇన్‌స్టాల్ చేశాన‌ని.. ప్ర‌స్తుతం వాటినే ఉప‌యోగిస్తున్నాన‌ని స‌మంత చెప్పింది. అంటే.. ఆమె చైతూ నుంచి విడిపోయాక‌.. ఎక్కువ‌గా మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. క‌నుక‌నే ఆమె కామింగ్ యాప్స్ ను వాడుతుంద‌ని, ప‌చ్చ‌ని ప్రకృతిలో గ‌డుపుతుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

కాగా త‌న‌తో సినిమాల‌ను తీసే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కూడా స‌మంత ఇటీవ‌ల కొన్ని కండిష‌న్స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. త‌న మూవీ షూటింగ్‌ల‌ను వీలైనంత వ‌ర‌కు హైద‌రాబాద్ లో కాకుండా చెన్నైలోనే ప్లాన్ చేయాల‌ని స‌మంత వారికి సూచించింద‌ట‌. ఇక హైద‌రాబాద్‌లో షూటింగ్ చేయాల్సి వ‌స్తే.. ఔట్ డోర్ కాకుండా ఇండోర్‌లోనే షూటింగ్ చేయాల‌ని కచ్చితంగా చెప్పేసిందట‌. దీని వ‌ల్ల ఫ్యాన్స్ తో అన‌వ‌స‌ర త‌ల‌నొప్పి ఎందుక‌ని స‌మంత భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విడాకుల అనంత‌రం ఆమె తీవ్ర‌మైన మాన‌సిక ఒత్తిడిలో ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now