గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : యూట్యూబ్ చాన‌ల్స్‌కు షాక్‌.. ప‌రువు న‌ష్టం దావా వేసిన స‌మంత‌..

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం చాలా మంది స‌మంత‌నే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ అయితే స‌మంత గురించి దారుణంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేశాయి. అయితే మొద‌ట్లో కామ్‌గానే ఉన్న స‌మంత.. ఇప్పుడు షాకింగ్…

Samantha : యూట్యూబ్ చాన‌ల్స్‌కు షాక్‌.. ప‌రువు న‌ష్టం దావా వేసిన స‌మంత‌..

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం చాలా మంది స‌మంత‌నే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ అయితే స‌మంత గురించి దారుణంగా వార్త‌ల‌ను ప్ర‌సారం చేశాయి. అయితే మొద‌ట్లో కామ్‌గానే ఉన్న స‌మంత.. ఇప్పుడు షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. స‌ద‌రు యూట్యూబ్ చాన‌ల్స్‌కు ప‌రువు న‌ష్టం దావా నోటీసులు పంపించింది. దీంతో ఆ కేసును కోర్టు విచారించ‌నుంది.

Samantha took important decision put case on youtube channels

సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ వంటి యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు వెంకట్రావు అనే లాయర్ పై స‌మంత ప‌రువు న‌ష్టం దావా వేసింది. ఇక ఆమె త‌ర‌ఫున బాలాజీ అనే హైకోర్టు న్యాయ‌వాది వాదిస్తున్నారు.

త‌న వ్య‌క్తిత్వాన్ని కించ ప‌రుస్తూ ఆయా యూట్యూబ్ చాన‌ల్స్ ప్ర‌సారం చేసిన క‌థ‌నాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌మంత పిటిష‌న్‌లో పేర్కొంది. అయితే ఇలాంటివ‌న్నీ సినిమావాళ్ల‌కు స‌హ‌జ‌మే అని.. కొంత కాలం అయితే అంతా స‌ద్దుమ‌ణుగుతుంద‌ని.. అన‌వ‌స‌రంగా ఇలాంటి విష‌యాల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని.. కొంద‌రు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు స‌మంత‌కు సూచించార‌ట‌. అయిన‌ప్ప‌టికీ ఆమె వారిపై న్యాయ పోరాటం చేసే దిశ‌గానే ముందుకు సాగుతుండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి