Samantha : ఆ స‌మ‌యంలో రోజుకు ఒక్క‌సారే తిన్నా.. షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించిన స‌మంత‌..

February 3, 2022 9:20 PM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం స‌మంత ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆమె న‌టించిన సినిమాలు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి. ఇక ఇటీవ‌లే పుష్ప సినిమాలో ఓ ప్ర‌త్యేక సాంగ్‌లో డ్యాన్స్ చేసిన స‌మంత అంద‌రినీ.. అల‌రించింది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా.. అంటూ హుషారెత్తించింది.

Samantha told that she ate only one time per day at that time
Samantha

పుష్ప సినిమాకు స‌మంత ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఆమెకు ఐట‌మ్ సాంగ్స్ చేయాల‌ని ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్లు తెలిసింది. అందులో భాగంగానే ఆమె త్వ‌ర‌లో లైగ‌ర్ సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక స‌మంత తాజాగా త‌న సినీ కెరీర్ తొలినాళ్ల‌లో ఎలాంటి ప‌రిస్థితుల‌ను అనుభ‌వించిందో చెప్పుకొచ్చింది.

తాజాగా జ‌రిగిన ఓ కార్య‌క్రమంలో మాట్లాడిన స‌మంత‌.. తాను సినిమాల్లోకి రాక‌ముందు ఎలాంటి దుర్భర ప‌రిస్థితుల‌ను అనుభ‌వించిందో తెలియ‌జేసింది. తాను కాలేజీ టాప‌ర్ అని, అయితే త‌న త‌ల్లిదండ్రుల‌కు స్థోమ‌త లేనందు వ‌ల్ల ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వ‌లేక‌పోయాన‌ని తెలిపింది. అందులో భాగంగానే యాక్టింగ్ కెరీర్‌ను ఎంచుకున్న‌ట్లు వివ‌రించింది.

అయితే కెరీర్ తొలిరోజుల్లో అనేక ప‌నులు చేశాన‌ని.. ఒక్కో స‌మ‌యంలో అస‌లు తిన‌డానికి తిండే ఉండేది కాద‌ని.. రోజుకు ఒక్క‌సారి మాత్ర‌మే తినేదాన్న‌ని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రైనా అమ్మాయిలు త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకునే వ‌ర‌కు విర‌మించుకోవ‌ద్ద‌ని, ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముంద‌డుగు వేయాల‌ని ఆమె సూచించింది. కాగా స‌మంత ప్ర‌స్తుతం కాతు వాకుల రెండు కాద‌ల్ అనే త‌మిళ సినిమాతోపాటు శాకుంత‌లం, య‌శోద అనే సినిమాల్లో న‌టించింది. ఈ మూవీలు త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment