Samantha : నేను చేసిన పనికి ప్రీతమ్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు.. తన డిజైనర్ పై సమంత షాకింగ్ కామెంట్స్..!

March 24, 2022 2:31 PM

Samantha : విడాకుల తర్వాత సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈమె ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం సమంత నార్త్ ఇండియాలో ఎక్కువగా గడుపుతోంది. ఇక సమంత యశోద సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తన టీమ్ కూడా తనతో పాటే ఉంది. షూటింగ్ విరామంలో సమంత తన టీం మెంబర్స్ తో కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే తన స్పెషల్ డిజైనర్ ప్రీతమ్ జుక‌ల్కర్ కూడా తన వెంటే ఉన్నాడు.

Samantha said preetham jukalker did not give her pending money
Samantha

ఇక ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో సమంత తన స్టైలిస్ట్ ప్రీతమ్ కి హెయిర్ స్టైలిస్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే సమంత స్వయంగా కత్తెర చేతపట్టి ప్రీతమ్ జుట్టును ఎంతో స్టైలిష్ గా కట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోని సమంత సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ… తాను మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకొచ్చింది. అదే విధంగా ప్రీతమ్ కి జుట్టు కట్ చేసినందుకు ప్రీతమ్ తనకింకా డబ్బులు చెల్లించలేదని అత‌నిపై ఫన్నీ కామెంట్ చేసింది.

ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత, ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ అందరికీ తెలిసిందే. అయితే సమంత విడాకుల సమయంలో ప్రీతమ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అత‌ని వల్లే సమంత, నాగచైతన్య విడిపోయారనే వార్తలు షికార్లు చేశాయి. అయితే ఈ వార్తలను ప్రీతమ్‌ తీవ్రంగా ఖండిస్తూ సమంతను తాను అక్క అని పిలుస్తానని.. త‌మ‌ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాగచైతన్యకు కూడా తెలుసు.. అంటూ చెప్పుకొచ్చాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now