Samantha : నీ జీవితానికి ఏది ముఖ్య‌మో అది చేయి.. స‌మంత కామెంట్స్ వైర‌ల్‌..

November 13, 2021 10:52 PM

Samantha : నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తోంది. ప‌లు విష‌యాల‌పై ఆమె మై మామ్‌ సెయిడ్ అనే హ్యాష్ ట్యాగ్‏తో పలు కోట్స్ షేర్ చేస్తోంది. అలాగే మరికొన్ని మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది సామ్. త‌న మాన‌సిక ప‌రిస్థితిని స‌మంత ఇలా వివ‌రిస్తుంద‌ని కొంద‌రు అంటున్నారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Samantha said do what you have to for your life

ఇతరులు చేసిన పనిని నువ్వు చేయాల్సిన అవసరం లేదు.. నీ జీవితానికి ఏది ముఖ్యమో ఆ పని చేయి” ..అంటూ సద్గురు వ్యాఖ్యలను పోస్ట్ చేసింది సామ్. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందిస్తున్నారు. స‌మంత ఇప్పుడు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఆమెకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత అనుహ్యంగా ఆ బంధానికి స్వస్తి చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో సామ్ పేరు మారుమోగిపోతోంది. విడాకుల త‌ర్వాత ఏ మాత్రం అధైర్య‌ప‌డ‌కుండా స‌మంత త‌న ప‌నులు తాను చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం సామ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టిందని.. వరుస ప్రాజెక్ట్స్‏కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. సామ్‌ న‌టించిన శాకుంత‌లం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now