Samantha : తొమ్మిదేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలి చివరకు పెద్దల అంగీకారంతో ఘనంగా పెళ్లి చేసుకున్న జంట సమంత- నాగ చైతన్య. అందమైన జంటని చూసి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇకపై తాము భార్యాభర్తలుగా ఉండబోమని, కేవలం స్నేహితులుగా కొనసాగుతామంటూ ఇరువురు కూడా అఫిషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చి షాకిచ్చారు. దీంతో ఈ బ్రేకప్ వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
విడాకుల ప్రకటన అనంతరం అటు సమంత, ఇటు నాగ చైతన్య వేరు వేరు గృహాలకు షిఫ్ట్ అయి తమ తమ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇద్దరూ వారి వారి సినిమాలతో బిజీ అయిపోయారు. సమంత అయితే బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని ప్రాజెక్టులకు ఓకే అంటోంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో విక్కీ కౌశల్, తాప్సీ, సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరు చిట్ చాట్ చేశారు.
చిట్ చాట్‌లో 2021 ఎలా గడిచిందని సమంతని ప్రశ్నించగా, అందుకు స్పందించిన సామ్.. ఈ ఏడాది నా జీవితంలో చాలా క్లిష్టమైన సంవత్సరం అంటూ కామెంట్స్ చేసింది. డిసెంబర్ 6న ఇందుకు సంబంధించి పూర్తి వీడియో బయటకు రానుంది. విడాకుల తర్వాత సమంత చాలా మనోవేదనకు గురైంది. దాని నుండి బయట పడేందుకు సామ్ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఏడాది తన జీవితంలో అత్యంత విచారకరమైన సంవత్సరం అని సమంత చెప్పింది. అంటే.. విడాకులతో తాను తీవ్రంగా మనస్థాపం చెందినట్లు స్పష్టమవుతుంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…