Samantha : అమెరికాలో సమంతకి స్కిన్ ట్రీట్‌మెంట్‌.. ఏమైందని ఆందోళన చెందుతున్న అభిమానులు..

September 19, 2022 10:59 AM

Samantha : గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అంతేకాదు సోషల్‌ మీడియాకు చాలాకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా సామ్‌ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె బయటకు రావడం లేదంటూ వార్తలొచ్చాయి.

అయితే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ముఖం లాగేసి డల్ గా మారిపోయి.. ఓ పేషెంట్ లా తయారైంది అంటున్నారు జనాలు. ఈ నేపథ్యంలో సామ్ పై లేటెస్ట్ గా ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే.. త్వరలో సామ్ స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తోందని సమాచారం.

Samantha reportedly getting treatment in america
Samantha

అక్కడున్న టాప్ స్కిన్ కేర్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోనుందట. అందుకే ఖుషి షూటింగ్‌లో కూడా పాల్గొనలేనని చెప్పిందట. దీంతో ఆ మూవీ రిలీజ్ ఆలస్యం కానుందట. మొత్తానికి సమంత ఆరోగ్య సమస్యతో బాధ పడుతుందని తేలిపోయింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. సామ్ కి ఇలా అయిందని తెలియడంతో సామ్ ఫ్యాన్స్ తో పాటు చైతూ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చాలా టాలెంటెడ్ నటి అని, త్వరగా కోలుకుని తిరిగి సినిమాల్లో యాక్టివ్ గా నటించాల‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now