Samantha : ఎన్‌టీఆర్‌తో చేసేందుకు నో చెప్పిన స‌మంత‌..? కార‌ణం అదే..?

August 28, 2022 10:33 AM

Samantha : కొంత కాలం క్రితం తెలుగు హీరోయిన్ల‌లో స‌మంత టాప్ పొజిస‌న్ లో ఉండేది. కానీ నాగ చైత‌న్య‌తో వివాహం త‌రువాత త‌న‌కు నెమ్మ‌దిగా సినిమా అవ‌కాశాలు రావ‌డం త‌గ్గిపోయింది. పెళ్లి త‌రువాత ఈమె చాలా పెద్ద సినిమాల‌ను చేజార్చుకుంద‌ని స‌మాచారం. కానీ త‌ను విడాకులు తీసుకున్న ద‌గ్గ‌రి నుండి మ‌ళ్లీ మునుప‌టి లా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టింది. హాట్ ఫోటో షూట్ ల‌తో వేగంగా సినిమాలు ఒప్పుకుంటూ దూకుడు పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు. అంతే కాకుండా పుష్ప సినిమాలో స‌మంత చేసిన ఐటం సాంగ్ సూప‌ర్ హిట్ కావ‌డంతో ఈమెకు దేశ‌వ్యాప్త గుర్తింపు ల‌భించింది. దాంతో బాలీవుడ్ నుండి కూడా ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లైంది.

పుష్ప ఐటం సాంగ్ తో ఎక్స్ పోజింగ్ హ‌ద్దులు చెరిపేసిన స‌మంత కోసం తెలుగు నిర్మాత‌లు క్యూ క‌డ‌తార‌ని భావించిన‌ప్ప‌టికీ అలా జ‌ర‌గ‌డం లేదు. దానికి కార‌ణం స‌మంత రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచ‌డమే అంటున్నాయి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు. నిజానికి పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట ద్వారా స‌మంత‌కి వ‌చ్చిన క్రేజ్ చూసిన‌ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో తాను తీయ‌బోయే త‌దుప‌రి సినిమాలో చేయ‌డానికి అడిగిన‌ట్లు స‌మాచారం. కానీ స‌మంత ఈ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించింద‌ని తెలిసింది.

Samantha reportedly denied Jr NTR movie
Samantha

అయితే కొర‌టాల శివ తాను చేయ‌బోయే జూనియ‌ర్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం స‌మంత‌కి రూ.2.50 కోట్ల పారితోషికం కూడా ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. కానీ స‌మంత రూ.4 కోట్లు డిమాండ్ చేసింద‌ని చెబుతున్నారు. అంత‌కంటే త‌క్కువ అయితే చేసేది లేద‌ని తేల్చి చెప్పింద‌ట. కానీ నిర్మాత‌లు అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వ‌డానికి ఒప్ప‌కోకపోవ‌డంతో స‌మంత ఈ ఆఫ‌ర్ ను వ‌దులుకుంద‌ని స‌మాచారం. దాంతో మంచి అవ‌కాశాన్ని చేజార్చుకుంద‌ని సినీ వ‌ర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment