Samantha : నాగ‌చైత‌న్య ఇంటిని కొనుగోలు చేసిన స‌మంత‌..? భారీగానే ఖ‌ర్చు పెట్టింద‌ట‌..!

July 29, 2022 7:00 PM

Samantha : ఈ మ‌ధ్య‌కాలంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత ఇద్ద‌రూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. స‌మంత కాఫీ విత్ క‌ర‌ణ్ అనే షోలో పాల్గొని సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. విడాకులు తీసుకుంటున్న‌ప్పుడు ఎంత‌గానో బాధ‌ప‌డ్డాన‌ని.. త‌మ విడాకులు అంత సుల‌భంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. ఆరంభంలో ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాన‌ని.. కానీ ఇప్పుడు అంతా స‌ర్దుకుంద‌ని స‌మంత చెప్పింది. అంతేకాదు.. చైత‌న్య‌ను భ‌ర్త అని పిలిచేందుకే ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు. మాజీ భ‌ర్త అని చెప్ప‌మ‌ని సూచించింది. అలాగే చైత‌న్య‌, త‌న‌ను ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో బంధిస్తే.. ప‌దునైన వ‌స్తువుల‌ను దూరంగా ఉంచాల‌ని కూడా చెప్పింది. అంటే.. వీరిమ‌ధ్య ప్రేమ కాస్తా శ‌త్రుత్వంగా ఎలా మారిందో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే స‌మంత చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

అయితే స‌మంత గురించి మ‌రో న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నాగ‌చైత‌న్య‌కు పెళ్ల‌యిన కొత్త‌లో గ‌చ్చిబౌలిలో ఉన్న ముర‌ళీ మోహ‌న్ ఇల్లు కావాల‌ని అడిగాడు. అయితే ఆయ‌న అది అమ్మ‌డం కుద‌ర‌ద‌ని చెప్పారు. దీంతో నాగార్జున ఎంట‌రై స‌ర్ది చెప్ప‌డంతో ముర‌ళీ మోహ‌న్ త‌న అపార్ట్‌మెంట్‌ను చైతూకు విక్ర‌యించారు. త‌రువాత స‌మంత‌, చైతూ ఇద్ద‌రూ అందులోనే ఉన్నారు. కానీ ఇద్దరూ విడిపోయాక చైతూ కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే ద‌గ్గ‌ర ఇల్లు కొని ఉంటున్నాడు. ఇక దాన్ని మ‌ళ్లీ ముర‌ళీ మోహ‌న్‌కే ఇచ్చార‌ట‌.

Samantha reportedly bought Naga Chaitanya house
Samantha

అయితే ముర‌ళీ మోహ‌న్ ఆ ఇంటికి రిపేర్లు చేయిస్తుండ‌గా.. స‌మంత వ‌చ్చి ఆ ఇల్లు త‌న‌కే కావాల‌ని.. త‌న‌కు ఎక్క‌డా ఇల్లు దొర‌క‌డం లేద‌ని చెప్పి.. గ‌తంలో క‌న్నా అధిక మొత్తాన్నే చెల్లించి ముర‌ళీ మోహ‌న్ ద‌గ్గ‌ర తిరిగి అదే అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింద‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌మంత ప్ర‌స్తుతం ఆ ఇంట్లో త‌న త‌ల్లితో క‌ల‌సి ఉంటుంద‌ట‌. అయితే ఇది సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్రచార‌మే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now