Samantha : పుష్ప ఐటమ్ సాంగ్ కోసం సమంత.. ఇన్ని కండిషన్లు పెట్టిందా..!

November 20, 2021 2:46 PM

Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. విడాకులను ప్రకటించిన తరువాత కొన్ని రోజులు తన స్నేహితులతో గడిపిన సమంత పలు సినిమా కథలను విని వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ లో నటించడానికి కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పాటలో చేయడానికి సమంత కొన్ని కండిషన్లు పెట్టిందని.. వాటికి ఓకే అంటేనే.. అందులో డాన్స్ చేస్తానని చెప్పిందట.

Samantha putting conditions for item song in pushpa movie

సమంత డైరెక్టర్ సుకుమార్ కు ఏ విధమైన కండిషన్స్ పెట్టింది అనే విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం వేసే సెట్ కేవలం రామోజీ ఫిలిం సిటీలో మాత్రమే వేయాలని సూచించిందట. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చిత్రీకరించే ప్రతి సన్నివేశం కూడా అక్కడే ఉండేవిధంగా ఏర్పాటు చేయమని చెప్పిందట. అలాగే ఈ పాట షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు అక్కడ సన్నివేశాలను గోప్యంగా ఉంచాలని డైరెక్టర్ కి తెలియజేసిందట.

అదే విధంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా అక్కడకు రాకుండా ఉండేలా ఏర్పాట్లు చేయమని ఈ సందర్భంగా సమంత.. డైరెక్టర్ సుకుమార్ కి కండిషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది.

సమంత కండిషన్స్ విన్న తర్వాత వాటికి డైరెక్టర్ ఓకే చెప్పిన అనంతరం సమంత ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కేవలం ఒక పాట కోసం సమంత ఏకంగా రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment