Samantha : అజ్ఞాతంలో ఉన్న స‌మంత‌.. ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉందో తెలిసిపోయింది..?

October 9, 2022 1:01 PM

Samantha : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు, షూటింగ్ లకు దూరంగా ఉన్న సమంత ఎక్కడుంది, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇటీవలే సామ్ విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె హైదరాబాద్‌లో మాత్రం లేదు.

సామ్ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతోందని, అందుకే అమెరికా వెళ్లిందని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత కొన్ని పూజలు, హోమాలు చేసింది, వాటి ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ సమంత టీమ్ మాత్రం అవన్నీ కేవలం రూమర్ అని ఖండిస్తూనే ఉంది. అయితే అసలు ఏం జరుగుతోందన్న దానిపై క్లారిటీ లేదు. సమంత నటించిన 2 సినిమాలు.. యశోద మరియు శాకుంతలం షూటింగ్ పూర్తి కావస్తున్నా విడుదల తేదీల‌ను ప్రకటించలేదు.

Samantha present location she is reportedly in Ashram
Samantha

నవంబర్ లో విడుదల కావాల్సిన శాకుంతలం 3డి కారణంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. యశోద డబ్బింగ్ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమంత ప్రస్తుతం కోయంబత్తూర్ లోని సద్గురు ఇషా ఫౌండేషన్‌లో ఉందని సమాచారం. కొంత సాంత్వన మరియు మనశ్శాంతి కోసం ఆమె అక్కడికి వెళ్లిందని అంటున్నారు. ఈ నెల 10న ఆమె తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత యశోద విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే సమంత ఖుషి షూటింగ్ లో పాల్గొననుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now