గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : మరో కొటేషన్‌ చెప్పిన సమంత.. ఈసారి ఒత్తిడి గురించి..!

Samantha : సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీగా ఉండి పోయారు. ఈ క్రమంలోనే సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తన స్నేహితులతో కలిసి…

Samantha : మరో కొటేషన్‌ చెప్పిన సమంత.. ఈసారి ఒత్తిడి గురించి..!

Samantha : సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత ఎవరి జీవితంలో వారు బిజీగా ఉండి పోయారు. ఈ క్రమంలోనే సమంత ఆ బాధ నుంచి బయట పడటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లడమే కాకుండా విదేశీ పర్యటనలు చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సమంత విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆసక్తికరమైన పోస్టులను చేస్తూ తన మనసులో ఉన్న భావాలను బయట పెడుతోంది.

Samantha posted another quotation its about stress

గత కొద్ది రోజుల క్రితం ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రుల భారం అంటూ అమ్మాయిల గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సమంత తాజాగా మరొక ఆసక్తికరమైన పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రముఖ రచయిత రాబర్ట్ మెక్‌కీ కొటేషన్ ను ఈమె పోస్ట్ చేసింది. ఒత్తిడికి గురైనప్పుడు మనం నిర్ణయాలు తీసుకున్నా లోతుగా మన స్వభావం సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందని.. కొటేషన్ ను పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన ఇన్‌ స్టాగ్రామ్ వేదికగా నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసి పూర్తిగా తన జ్ఞాపకాల నుంచి బయట పడటం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం తన స్నేహితురాలు సాధన సింగ్, డిజైనర్ ప్రీతమ్ తో కలిసి దుబాయ్ వెళ్లింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి