గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha Naga Chaithanya : వేరే అమ్మాయితో చైతూకి రిలేష‌న్‌.. అందుకే సామ్ విడాకులు ఇచ్చింద‌న్న ప్రీత‌మ్..?

Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైత‌న్య, స‌మంత వైవాహిక బంధంపై అక్టోబ‌ర్ 2న అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. మేము ఇద్ద‌రం విడిపోతున్నాం. భ‌విష్య‌త్‌లో స్నేహితులుగా మాత్ర‌మే ఉంటాం అని ప్ర‌క‌టించారు. పదేళ్ల స్నేహానికి…

Samantha Naga Chaithanya : వేరే అమ్మాయితో చైతూకి రిలేష‌న్‌.. అందుకే సామ్ విడాకులు ఇచ్చింద‌న్న ప్రీత‌మ్..?

Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైత‌న్య, స‌మంత వైవాహిక బంధంపై అక్టోబ‌ర్ 2న అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. మేము ఇద్ద‌రం విడిపోతున్నాం. భ‌విష్య‌త్‌లో స్నేహితులుగా మాత్ర‌మే ఉంటాం అని ప్ర‌క‌టించారు. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని పేర్కొంది. కాగా 2017, అక్టోబర్‌ 7న సమంత – నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు.

Samantha Naga Chaithanya separated because of another girl with chaithu meaning in preetham post

విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత స‌మంత‌నే అందరు ముద్దాయిగా చిత్రీక‌రిస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. స‌మంత‌కి ఎఫైర్స్ ఉన్నాయ‌ని, పిల్ల‌ల విష‌యంలో అభ్యంత‌రం వ్య‌క్తం చేసింద‌ని, ఏవేవో పుకార్లు పుట్టించారు. వీటిపై సామ్ క్లారిటీ ఇచ్చినా కూడా ఆ పుకార్లు ఆగ‌లేదు. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులపై స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టులు చేశాడు.

‘కంగ్రాట్స్ స్లట్.. హీ ఈజ్ యువర్స్’ అని ప్రీత‌మ్ ఇన్ స్టా స్టోరీని షేర్ చేయగా, అది ఎవరిని ఉద్దేశించి చేసిందోననే చర్చ నడుస్తోంది. ఇక ‘అబద్ధాలు, రహస్యాలు బంధాలను నాశనం చేస్తాయి. ఎంత దాచిపెట్టినప్పటికీ ఏదో ఒక రోజు అవి బయటపడుతాయి’ అని ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు. చైతూని ఉద్దేశించి ప్రీత‌మ్ ఇలాంటి కామెంట్స్ చేశాడా.. అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

చైతూ వేరు అమ్మాయితో రిలేష‌న్‌లో ఉండ‌డం వ‌ల‌న‌నే స‌మంత విడాకులు ఇచ్చిందా.. అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అయితే  ఈ స్టోరీలు పోస్టు చేసిన రెండు గంటల తర్వాత ప్రీతమ్ జుకల్కర్ వాటిని డిలీట్ చేయడం గమనార్హం. కాగా.. ఇటీవ‌ల ప్రీత‌మ్.. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, తమ రిలేషన్ షిప్ ఏంటో నాగచైతన్యకు తెలుసని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్రీతమ్‌ అలా పోస్టులను ఎందుకు డిలీట్‌ చేశాడనేది సందేహంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి