Samantha : స‌మంత‌కు హీరో స‌మ‌స్య‌.. పాపం ఎన్నిక‌ష్టాలు వ‌చ్చాయి..?

October 18, 2021 4:46 PM

Samantha : తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను స‌మంత‌. ఆచితూచి సినిమాలు చేస్తూ అల‌రిస్తూ వ‌చ్చిన స‌మంత ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే కొద్ది రోజుల క్రితం నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు సంబంధించి ఎన్నో క‌థ‌నాలు, రూమర్స్ వ‌చ్చాయి. అన్నింటినీ ఓపిక‌గా భ‌రిస్తూ ముందుకు సాగుతోంది స‌మంత‌.

Samantha movie getting problems for hero

సమంత విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాకు హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు.

శ్రీదేవీ మూవీస్ కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనేసరికి మన హీరోలు మొహం చాటేస్తారు. అలా అని మరీ చిన్నా చితక హీరోను తీసుకుంటే సమంత పక్కన బాగోదు. ఈ క్ర‌మంలో మంచి హీరో కోసం వెతికే ప‌నిలో ప‌డ్డారు మేక‌ర్స్. నవంబర్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment