Naga Chaitanya : నాగ‌చైత‌న్య‌తో ఆ పేప‌ర్స్‌పై స‌మంత బ‌ల‌వంతంగా సంత‌కం చేయించిందా ?

June 6, 2022 10:17 PM

Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరుగాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య ఉన్న‌ట్లుండి స‌డెన్ గా విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. ఈ వార్త‌ను చ‌దివి అంద‌రూ ఒక్క‌సారిగా షాకయ్యారు. అస‌లు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు క‌దా.. అనే సందేహాలు అంద‌రికీ వ‌చ్చాయి. అయితే వీరి విడాకుల‌కు కార‌ణం ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌లేదు. కానీ తాజాగా ఓ సంచ‌ల‌న విష‌యం మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

నాగ‌చైత‌న్య ఇటీవ‌లే థాంక్ యూ అనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేసిన విష‌యం విదిత‌మే. ఇందులో అవికా గోర్‌, రాశి ఖ‌న్నా కూడా న‌టించారు. అయితే తాజాగా చైతూ అమెజాన్ ప్రైమ్ తెర‌కెక్కిస్తున్న దూత అనే సిరీస్‌లో న‌టిస్తున్నాడు. ఇందులో చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ను చైతూ చేసేందుకు స‌మంత‌నే కార‌ణ‌మ‌ట‌. అప్ప‌ట్లో ఈ సిరీస్‌ను చేయాల్సిందిగా స‌మంత.. చైతూను బ‌ల‌వంత పెట్టింద‌ట‌. ఆమెతో క‌లసి ఉన్న స‌మ‌యంలో చైతూ సినిమాల వ్య‌వ‌హారాల‌ను ఆమెనే ద‌గ్గ‌రుండి చూసుకునేద‌ట‌. క‌నుకనే దూత సిరీస్ చేయాల్సిందిగా ప‌ట్టుబ‌ట్టింద‌ట‌. దీంతో ఆమె ఒత్తిడి మేర‌కు చైతూ త‌న‌కు ఇష్టం లేక‌పోయినా ఈ సిరీస్‌ను చేసేందుకు అంగీక‌రిస్తూ.. ప‌త్రాల‌పై సంత‌కం చేశాడ‌ట‌. అయితే ఈ విష‌యంలో ఎంత నిజం ఉంది.. అన్న‌ది తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతానికి చైతూ అయితే ఈ సిరీస్ చేస్తున్నాడు. మ‌రి ఇందులో చైతూది నిజంగానే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రేనా.. కాదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Samantha made Naga Chaitanya to sign on series papers
Naga Chaitanya

ఇక స‌మంత త‌న పెళ్లి విష‌యంలోనూ చైతూ త‌ల్లిదండ్రుల‌ను బ‌ల‌వంతంగా ఒప్పించింద‌ట‌. అప్ప‌ట్లో అఖిల్ నిశ్చితార్థం ఆగిపోయింది. దీంతో స‌మంతతో పెళ్లి వ‌ద్ద‌ని.. ఇంకో అమ్మాయిని చేసుకోవాల‌ని నాగార్జున చైతూకు చెప్పార‌ట‌. కానీ స‌మంత వారిని బ‌లవంతంగా ఒప్పించి చైత‌న్య‌ను వివాహం చేసుకుంద‌ట‌. ఈ విష‌యం కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే వీరు విడాకుల విష‌యాన్ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఇలాగే ఎన్నో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ వీటిలో నిజం ఎంత ఉంది అన్న‌ది తెలియ‌లేదు. అలాగే ఈ విష‌యాలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఎప్ప‌టికైనా నిజం బ‌య‌ట ప‌డ‌క త‌ప్ప‌దు. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment