గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : చైతూ ఇంట్లోనే సమంత.. వైరల్ గా మారిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..!

Samantha : సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య తన పనులలో బిజీగా ఉండగా సమంత మాత్రం తన స్నేహితులతో కలిసి పలు…

Samantha : చైతూ ఇంట్లోనే సమంత.. వైరల్ గా మారిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..!

Samantha : సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య తన పనులలో బిజీగా ఉండగా సమంత మాత్రం తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విదేశాలకు వెళుతూ తనలో ఉన్న బాధను మరచిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చైతన్యతో తనకున్న ఒక్కొక్క జ్ఞాపకాలను తొలగిస్తున్న సమంత తాను ఉండబోయే ఇంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Samantha living in chathanya house

చైతన్యతో సమంత కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో సమంత పూర్తిగా చైతన్య జ్ఞాపకాలను తుడి చేస్తుందని అందరూ భావించారు. కానీ సమంత మాత్రం ఇదివరకు చైతన్యతో కలసి ఉన్న ఇంటిలోనే ప్రస్తుతం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాజా పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత మార్నింగ్‌ మ్యాడ్‌నెస్‌ అంటూ తన రెండు కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

అలాగే ‘న్యూ బ్రింగింగ్‌ బ్యాక్‌’ పేరిట గతంలో తాను చైతన్యతో కలసి ఉన్న ఇంటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టు చూస్తుంటే సమంత ఇకపై ఈ ఇంటిలోనే నివసించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైతన్య విషయానికి వస్తే గత ఏడాది జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశాడు. ఇకపై ఆ భవనంలోనే ఒంటరిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి