గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : బలమైన వ్యక్తులు ఎవరు ? సమంత లేటెస్ట్‌ పోస్ట్‌.. ఎన్నో ప్రశ్నలు..!

Samantha : అక్కినేని నాగ చైత‌న్య‌తో ఎంతో అన్యోన్యంగా ఉన్న స‌మంత ఊహించని విధంగా అతనికి విడాకులు ఇచ్చింది. పాత జ్ఞాప‌కాలు మ‌ర‌చిపోయేందుకు తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా…

Samantha : బలమైన వ్యక్తులు ఎవరు ? సమంత లేటెస్ట్‌ పోస్ట్‌.. ఎన్నో ప్రశ్నలు..!

Samantha : అక్కినేని నాగ చైత‌న్య‌తో ఎంతో అన్యోన్యంగా ఉన్న స‌మంత ఊహించని విధంగా అతనికి విడాకులు ఇచ్చింది. పాత జ్ఞాప‌కాలు మ‌ర‌చిపోయేందుకు తన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తోంది సమంత. ఇటీవల తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి ఆధ్యాత్మిక పర్యటనలు చేసింది. పలు పూజలు నిర్వహించింది. మ‌రోవైపు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కోట్స్ పెడుతోంది.

Samantha latest quote about strong persons who are they

మై మామ్స్ సెయిడ్ అంటూ పలుమార్లు ఇంట్రెస్టింగ్ కోట్స్‌ షేర్‌ చేసిన సమంత.. కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ కోట్స్ కూడా తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం తన మానసిక పరిస్థితిని ఇలా కోట్స్ రూపంలో ఆమె తెలియజేస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సామ్ తన ఇన్‏స్టా స్టోరీలో ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది. ఎవరైనా మనముందు తమ బలాన్ని ప్రదర్శిస్తే.. వారు బలమైన వ్యక్తులు కాదని.. పేర్కొంది.

అసలు ఏమీ చెప్పకుండా.. తెలియకుండా.. యుద్ధంలో గెలిచిన వారే.. అస‌లు సిస‌లైన బ‌లమైన వ్య‌క్తులు.. అంటూ స‌మంత త‌న ఇన్‌స్టాలో పెట్టింది. అయితే ఈ పోస్ట్ చైతూని ఉద్దేశించి పెట్టిందా, లేక అక్కినేని ఫ్యామిలీలో త‌నని ఇబ్బంది పెట్టిన వారిని ఉద్దేశించి పెట్టిందా.. అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి కోట్స్ పెద్ద‌గా పోస్ట్ చేయ‌ని సామ్.. ఈ మధ్య వ‌రుస పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్ లో ప‌లు అనుమానాలను రేకెత్తిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి