Samantha : మ‌తులు పోగొడుతున్న స‌మంత అందం.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్..

May 3, 2022 5:18 PM

Samantha : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత ఇటీవ‌ల తెగ ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు ఇటు సినిమాలు అటు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తోంది. సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈక్ర‌మంలో స‌మంత న‌టించిన శాకుంతలం, య‌శోద‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. స‌మంత న‌టించిన పాన్ ఇండియా మూవీ యశోద ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల‌ను జరుపుకుంటోంది.

Samantha latest pink color dress photo viral
Samantha

ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా సమంత త‌న సోష‌ల్ మీడియాలో పింక్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి క్లీవేజ్ షోతో కేక పెట్టించింది. ఇందులో ఓర‌గా చూపులు చూస్తూ కేక పెట్టిస్తోంది. స‌మంత లుక్స్‌కి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఈ పిక్ నెట్టింట తెగ వైర‌ల్ అయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా, క్యూట్ హీరోయిన్‌గా పేరున్న సమంత అలియాస్ సామ్ ఏం చేసినా హల్‌చల్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో విభిన్నరకాల పోస్టులతో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.

ఏమాయ చేశావే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం య‌శోద‌తో బిజీగా ఉండ‌గా.. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మే 5 ఉద‌యం 11.07 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now