Samantha : గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన సమంత.. ఆ ఆపరేషన్ వల్లే ఇలా అయ్యిందా..?

September 9, 2022 11:29 AM

Samantha : గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సామ్‌పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్‌ లైఫ్‌తో పాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్‌ మాత్రం ఇవన్ని లైట్‌ తీసుకుంది. అంతేకాదు సోషల్‌ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంతకాలంగా సామ్‌ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, మరికొందరు ఆమె గర్భసంచి తీయించుకుందని.. ఇలా ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అందుకే ఆమె బయటకు రావడం లేదంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా సికింద్రాబాద్ లోని వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు చేయించింది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సమంత లుక్స్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ముఖం లాగేసి డల్ గా మారిపోయి.. ఓ పేషెంట్‌లా తయారైంది అంటున్నారు జనాలు. దానికి కారణం ఆమె చేయించుకున్న ఆపరేషన్ అంటూ కొందరు కామెంట్స్ చేయగా.. మరికొందరు నాగచైతన్యని బాధపెట్టిన పాపాలు ఊరికేపోతాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Samantha latest photos viral she has changed a lot
Samantha

ఏది ఏమైనా సమంత ఈ లుక్స్ లో చాలా డల్ గా ఉంది. చూడగానే గుర్తుపట్టలేని విధంగా డీలా పడిపోయిన స్థితిలో ఉండడం ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. సామ్ వీలైనంత త్వరగా నార్మల్ అవ్వాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక సామ్‌ సినిమాల విషయానికొస్తే.. ఆమె నటించిన యశోద, శాకుంతలం చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఓ హిందీ వెబ్ సిరీస్ నిర్మాణంలో ఉంది. విజయ్‌ దేవరకొండతో కలసి నటిస్తున్న ఖుషి నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment