గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : స‌మంత‌పై విప‌రీత‌మైన ట్రోల్స్.. కార‌ణం ఏంటో తెలుసా ?

Samantha : విడాకుల తర్వాత స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తోంది. ఏదో ఒక విష‌యంపై స‌మంత స్పందిస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తూ ఉంటోంది. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సినిమాల్లో జోరు పెంచింది. కేవలం తెలుగులోనే…

Samantha : స‌మంత‌పై విప‌రీత‌మైన ట్రోల్స్.. కార‌ణం ఏంటో తెలుసా ?

Samantha : విడాకుల తర్వాత స‌మంత నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తోంది. ఏదో ఒక విష‌యంపై స‌మంత స్పందిస్తూ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తూ ఉంటోంది. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత సినిమాల్లో జోరు పెంచింది. కేవలం తెలుగులోనే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా సమంత స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు ఓకే చెప్పింది.

Samantha getting trolls for her item song in pushpa movie

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో సమంత స్పెషల్‌ సాంగ్‌లో నటిస్తోంది. గతకొన్ని రోజులుగా ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసిన నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది. ఈ స్పెషల్‌ సాంగ్‌ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ పాట షూటింగ్ పూర్తి చేయనున్నారు.

కేవలం 5 నిమిషాల నిడివి ఉన్న ఈ పాటలో నటించేందుకు సమంత కోటిన్నర రూపాయలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని భావిస్తోన్న చిత్ర యూనిట్‌ సమంత డిమాండ్‌ చేసినంతా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని సినీ వర్గల్లో టాక్‌ నడుస్తోంది. అయితే ఇన్నాళ్లు ప‌ద్ద‌తిగా ఉన్న స‌మంత ఐటెం సాంగ్‌కి ఓకే అన్నందుకు ఆమెపై తెగ ట్రోలింగ్ జ‌రుగుతోంది. మ‌రి తొలి సారి స‌మంత ఐటెం సాంగ్ చేస్తుండ‌గా, ఈ పాట‌తో ఆక‌ట్టుకుంటుందా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి