Samantha : గతేడాది అక్టోబర్ మొదటి వారంలో నాగచైతన్య, సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. సమంతనే కావాలని చైతూకు విడాకులు ఇచ్చిందని.. ఆమెకు సినిమాల్లో చేయడం అంటేనే ఇష్టమని.. భర్త అంటే ప్రేమ లేదని.. ఆమెకు పిల్లల్ని కనే ఉద్దేశం లేదని.. అబార్షన్లు జరిగాయని.. ఇలా రకరకాలుగా ఆమెపై వార్తలు వచ్చాయి.
ఇక ఓ దశలో అయితే నాగచైతన్య ఇస్తానన్న రూ.250 కోట్ల భరణాన్ని కూడా సమంత కాదనుకుందని వార్తలు వచ్చాయి. అయితే వీటిన్నింటికీ ఎట్టకేలకు సమంత సమాధానాలు చెప్పింది. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షో సీజన్ 7 ఎపిసోడ్ 3కు సమంత.. అక్షయ్ కుమార్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ ఆమెను ఆమె వైవాహిక జీవితానికి చెందిన ప్రశ్నలను అడిగారు. అయితే వాటికి ఎట్టకేలకు సమంత సమాధానాలు చెప్పింది.
నాగ చైతన్యతో విడిపోయిన తరువాత జీవితం ఎలా ఉంది ? అని కరణ్ జోహర్ అడగ్గా.. విడాకుల తరువాత చాలా కష్టంగా మారిందని తెలియజేసింది. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని సమంత రిప్లై ఇచ్చింది. తామిద్దరం విడిపోవడం సామరస్యంగా జరగలేదని.. విడిపోయిన తరువాత చాలా మనోవేదనకు గురైనట్లు తెలియజేసింది. అయితే ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేమని తెలిపింది.
ఇక చైతూతో విడాకుల తరువాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడుతూ.. నేను విడాకులు తీసుకున్న తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను వాటిపై ఫిర్యాదు చేయలేకపోయాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలను వెల్లడించి విడిపోయా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి నేను పెద్దగా బాధ పడలేదు. ట్రోల్ చేసే వారు నా జీవితంపై పెట్టుబడి పెట్టారు. అప్పుడు వాటికి స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు లేవు.. అంటూ సమంత తెలిపింది.
అయితే అప్పట్లో విడాకుల కోసం రూ.250 కోట్ల భరణం తీసుకుందని వచ్చిన వార్తలపై కూడా సమంత సమాధానం ఇచ్చింది. నాకు భరణంగా రూ.250 కోట్లు వచ్చిందని పుకార్లు వచ్చాయి. అయితే అది ఎంత అబద్ధమో మీడియానే గ్రహించింది. చివరకు ఆ అబద్దాలు వాటంతట అవే వీగిపోయాయి.. అని సమంత తెలియజేసింది.
ఇక 2009లో ఏ మాయ చేశావె సినిమా ద్వారా నాగ చైతన్యతో సమంతకు పరిచయం అయింది. తరువాత ఆ పరిచయం ప్రేమగా మారి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో 2017 అక్టోబర్ 6న వీరు వివాహం చేసుకున్నారు. తరువాత 4 ఏళ్ల పాటు వీరు అన్యోన్యంగా ఉన్నారు. ఈ క్రమంలోనే గతేడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుంటున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి నాగ చైతన్య గురించి సమంత ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తాజాగా విషయాలను వెల్లడించింది. దీంతో ఈమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…