Naga Chaitanya : నాగ‌చైత‌న్య‌కు స‌మంత తండ్రి ఇన్‌డైరెక్ట్ కౌంట‌ర్‌.. పోస్ట్ వైర‌ల్‌..

September 6, 2022 2:43 PM

Naga Chaitanya : ఏ మాయ చేశావే సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న‌ ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడాకులు ఎందుకు తీసుకున్నారు అని మాత్రం ఎవరికీ తెలీదు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. తాజాగా సమంత తండ్రి అయిన జోసెఫ్ ప్రభు ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.

లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాస్ ఏ స్టోరీ అంటూ ఆయన ఇంగ్లీషులో ఒక పోస్ట్ పెట్టాడు.. సమంత తండ్రి జోసెఫ్ చేసిన పోస్ట్‌ అర్థం ఏంటి అంటే.. ఒకానొక సమయంలో ఒక కథ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు.. ఆ కథ ఇక ఎప్పటికీ ఉండదు. కనుక ఇప్పుడు కొత్త కథను మొదలు పెట్టాలి, కొత్త చాప్టర్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నాగ చైతన్య అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సడన్ గా సమంత తండ్రి ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటూ చర్చ జరుగుతుంది. ఈ సమయంలో సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత మరియు నాగచైతన్య కు అధికారికంగా విడాకులు వచ్చాయి.

Samantha father indirect comments on Naga Chaitanya
Naga Chaitanya

కనుక ఈ సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టాడు అంటూ కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆయన చెప్తే కానీ తెలీదు. సమంత లేదా ఆమెకు సంబంధించిన వారు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అది నాగ చైతన్యకు లింక్ చేసి ఏదో ఒక రకంగా పుకార్లు షికార్లు చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ప్రస్తుతం చైతన్య, సమంత కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. చైతూ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాను, వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సామ్ ఖుషి, యశోద, శాకుంతలంతో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సెరీస్ లో నటిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now