Samantha : ప్రీత‌మ్.. చిచ్చు పెట్టింది ఇంక చాలు.. త‌ప్పుకో.. స‌మంత అభిమానుల ఆగ్ర‌హ జ్వాల‌లు..

October 9, 2021 8:01 PM

Samantha : నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకులు తీసుకోవ‌డం ఏమో గానీ.. వారిద్ద‌రూ విడిపోయేందుకు చాలా వ‌ర‌కు స‌మంత స్టైలిస్ట్ ప్రీత‌మ్ జుక‌ల్క‌ర్ కార‌ణ‌మ‌ని అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత ఓ పోస్టు ద్వారా ఇక విమ‌ర్శ‌లు ఆపాల‌ని కోరింది. అయిన‌ప్ప‌టికీ ఆమె అభిమానులు మాత్రం ప్రీత‌మ్‌ను తిట్ట‌డం ఆప‌డం లేదు.

Samantha fans trolling her stylist preetham

స‌మంత వైట్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించిన ఓ ఫోటోను ప్రీత‌మ్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ పోస్టు కింద కామెంట్ సెక్ష‌న్ మొత్తం స‌మంత అభిమానుల తిట్లు, విమ‌ర్శ‌ల‌తో నిండిపోయింది. దీంతో స‌మంత అభిమానులు ప్రీత‌మ్‌పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న‌ట్లు ఆ కామెంట్ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

https://www.instagram.com/p/CUwBoaGI8Z6/?utm_source=ig_web_button_share_sheet

స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల జీవితాల్లోకి ప్ర‌వేశించావు, వారి మ‌ధ్య చిచ్చు పెట్టావు.. ఇంక చాలు, ఆపు.. త‌ప్పుకో.. అంటూ స‌మంత అభిమానులు ప్రీత‌మ్‌ను దారుణంగా విమ‌ర్శిస్తూ తిడుతున్నారు. అయితే ప్రీత‌మ్ మాత్రం దీన్ని మాన‌సిక వేద‌న‌గా ఇదివ‌ర‌కే చెప్పాడు. మ‌రి ఈ విమ‌ర్శ‌లు ఎప్ప‌టికి ఆగుతాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment