గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : సమంత వృత్తి పరంగా ఒక దారిని ఎంచుకోనుందా..?

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో…

Samantha : సమంత వృత్తి పరంగా ఒక దారిని ఎంచుకోనుందా..?

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి సమంత చేసే అల్లరి గురించి సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Samantha done make up trending post

ఈ క్రమంలోనే ఆమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అదేవిధంగా సమంత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌ లో నటించడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇక సమంత తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటో చూస్తుంటే సమంత వృత్తిపరంగా మరొక దారిని ఎంచుకుందా.. అనే అనుమానం రాక మానదు. తాజాగా తన స్నేహితురాలు సాధన సింగ్ తో కలిసి సమంత ఒక ఫోటోను షేర్ చేసింది.

ఇందులో సమంత తన స్నేహితురాలు సాధనకు మేకప్ వేయడానికి సిద్ధం అయింది. ఈ క్రమంలోనే మేకప్ బాక్స్ ను తన చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “బ్రైడల్ బుకింగ్ ఓపెన్ ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి