Samantha : స‌మంత ప‌రువు న‌ష్టం కేసులో అప్‌డేట్‌.. ఉత్కంఠ‌గా మారుతున్న విచార‌ణ‌..!

October 22, 2021 8:28 PM

Samantha defamation case update fans are vey much interested to know what will happen

Samantha : స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుని విడిపోవ‌డం ఏమోగానీ.. న్యూస్ చాన‌ళ్లు, ప‌త్రిక‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్‌కు చేతినిండా ప‌ని దొరికింద‌ని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా స‌మంత మీదే ఎక్కువ‌గా మండిప‌డుతున్నారు. అన్నింటికీ ఆమే కార‌ణ‌మ‌ని ఆమెను నిందిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్ అయితే ఆమెను టార్గెట్‌గా చేసి చిల‌వ‌లు ప‌ల‌వలుగా క‌థ‌లు అల్లి వీడియోల‌ను పోస్ట్ చేశాయి. దీంతో ఆ చాన‌ల్స్ ఇప్పుడు ప‌రువు న‌ష్టం కేసును ఎదుర్కొంటున్నాయి.

అయితే కోర్టులో కేసు విచార‌ణ‌లో ఉంది కానీ.. జ‌డ్జి ఏ తీర్పు వెలువ‌రిస్తారోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గురువారం ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌మూర్తి కేసు విచార‌ణ‌ను శుక్ర‌వారంకు వాయిదా వేశారు. న‌టిగా స‌మంత బిజీ క‌నుక త్వ‌ర‌గా కేసును ముగించాల‌ని ఆమె త‌ర‌ఫు న్యాయ‌వాది జ‌డ్జిని కోరారు. అయితే చ‌ట్టం దృష్టిలో అంద‌రూ స‌మాన‌మే అని, ఇత‌ర ప‌రువు న‌ష్టం కేసుల్లాగే స‌మంత కేసును కూడా విచారిస్తామ‌ని, తొంద‌ర ప‌డ‌బోమ‌ని జ‌డ్జి చెప్పారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం మ‌రోమారు జ‌డ్జి వాద‌న‌ల‌ను విన్నారు.

అయితే ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌మూర్తి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేశారు. సోమ‌వారం మరోసారి వాద‌న‌ల‌ను విన్న త‌రువాత తీర్పును వెలువ‌రిస్తామ‌ని చెప్పారు. అయితే ప‌రువు న‌ష్టం కేసులో క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి అని కోరాలి గానీ.. డ‌బ్బులు అడ‌గ‌డ‌మేమిట‌ని జ‌డ్జి స‌మంత‌ను ప్ర‌శ్నించారు. దీంతో వారు క్ష‌మాప‌ణ‌లు కోర‌డంతోపాటు స‌ద‌రు యూట్యూబ్ చాన‌ల్స్ పోస్ట్ చేసిన వీడియోల తాలూకు లింక్‌ల‌ను కూడా డిలీట్ చేయాల‌ని కోరారు.

అయితే ఈ కేసులో జ‌డ్జి ఏమ‌ని తీర్పు చెబుతారా ? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. విచార‌ణ‌ను ఎదుర్కొంటున్న చాన‌ల్స్ వారు క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు అంగీక‌రిస్తే ఓకే. లేదంటే జ‌డ్జి ఇచ్చే తీర్పుపై వారి భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment